English | Telugu

తుల‌సి ఇంటికి కార్తీక్.. మోనిత‌కు ఫ్యూజులు ఔట్‌!

స్టార్ మాలో తెలుగులో ప్ర‌సారం అవుతున్న స‌క్సెస్‌ఫుల్ సీరియ‌ల్ 'కార్తీక దీపం'. సీరియ‌ల్స్‌లో దీనిపై వ‌చ్చిన‌న్ని మీమ్స్, కామెంట్స్ ఏ సీరియ‌ల్‌కి రాలేదేమో అన్నంత‌గా పాపులర్ అయిన ఈ సీరియ‌ల్ ఈ సోమ‌వారం ర‌స‌వ‌త్త‌ర మ‌లుపులు తిర‌గ‌బోతోంది. విహారి కార‌ణంగా దీప‌ని దూరం పెడుతూ వ‌స్తున్న కార్తీక్‌కి అత‌ని త‌ల్లి సౌంద‌ర్య నిజం చెప్పేస్తుంది. విహారికి పిల్ల‌లు పుట్టే అవ‌కాశం లేద‌ని, ఈ విష‌యం తెలియ‌క నువ్వే దీప‌ని అపార్థం చేసుకున్నావ‌ని చెబుతుంది.

త‌ల్లి చెప్పిన మాట‌ల్లో నిజ‌ముందని భావించిన కార్తీక్ ఆలోచ‌న‌లో ప‌డ‌తాడు. ఇందులో నిజ‌మెంతో నిర్ధార‌ణ చేసుకునే దాకా త‌న‌కు నిద్ర‌ప‌ట్ట‌ద‌ని భావించిన కార్తీక్ వెంట‌నే తుల‌సి వ‌ద్ద‌కు బ‌య‌లు దేర‌తాడు. ఇంత‌లో కార్తీక్‌కి మోనిత ఫోన్ చేస్తుంది. "ఎక్క‌డున్నావ్‌?"..అని అడుగుతుంది. "తుల‌సి ద‌గ్గ‌ర‌కు వెళుతున్నా. అస‌లు వీళ్లె చెబుతున్న‌ది నిజ‌మో కాదో తెలుసుకోవాలి క‌దా" అంటాడు కార్తీక్‌.. దీంతో మోనిత‌కు ఫ్యూజులు ఔట్ అవుతాయి. "తుల‌సి ద‌గ్గ‌రికి ఎందుకు వ‌ద్దు" అంటుంది.

అయినా విన‌కుండా కార్తీక్ .. తుల‌సి ఇంటికి వెళ్లిపోతాడు. అక్క‌డికి వెళ్లిన కార్తీక్‌‌కి నిజం తెలిసిందా?.. తుల‌సి క‌నిపించిందా? .. కార్తీక్ త‌రువాత ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నాడు అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.