English | Telugu

కృష్ణకి ముకుంద అసలు నిజం చెప్పనుందా?

స్టార్ మా టీవీలో ప్రసరమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -260 లో... ముకుంద గదిలోకి అలేఖ్య వస్తుంది . ఆ రోజు నువ్వు భవానీ అత్తయ్యకి నీ ప్రేమ విషయం చెప్పడానికి ముకుంద లవ్స్ మురారి అని రాసావ్ కదా అది ఎవరు తీసారో తెలుసా అని ముకుందని అడుగగా.. ఇంకెవరు రేవతి అత్తయ్య అని ముకుంద అంటుంది. రేవతి అత్తయ్య కాదని మధు వాటిని చేంజ్ చేశాడని చెప్తుంది. అమ్మో అలేఖ్యలో ఈ కోణం కూడా ఉందా అని ముకుంద అనుకొని కాస్త దూరంగా ఉంటూనే బాగుంటుందని ముకుంద అనుకుంటుంది. ఇక టిఫిన్ చేద్దామని కిందకి వెళ్దామని అని అలేఖ్య అనగానే.. నువ్వు వెళ్ళు నేనొస్తా అని ముకుంద అంటుంది.

ఆ తర్వాత అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర వెయిట్ చేస్తుంటారు. అయితే అక్కడే ఉన్న రేవతిని నువ్వు కూర్చొని తినమని భవాని అంటుంది. అందరికి వడ్డించాక తింటానని రేవతి అనగా.‌. ఏంటి మీరు వడ్డిస్తేనే కానీ తినరా? అని సుభాష్ ని భవాని అడుగగా.. లేదు వదిన.. అడిగి కొసరి కొసరి వడ్డిస్తుందని వాళ్ళంటారు. సరే అని రేవతి కూర్చొని తింటుంది. కృష్ణ, ముకుంద ఎక్కడని భవాని అడుగగా.. వాళ్ళ గదిలో ఉన్నారని అలేఖ్య అంటుంది. తను ఒంటరిగా ఉంటూ బాధపడుతుందని అలేఖ్య అనగా.. అవునా అయితే వెళ్లి పిలుచుకొని రా అని భవాని అంటుంది. కాసేపటికి కృష్ణ వస్తుంది. నీకొకటి చెప్పాను గుర్తుందా అని ఒక కృష్ణతో భవాని అంటుంది. కాసేపు ఆలోచించిన కృష్ణ.. హా క్యాంప్ కి వెళ్ళొచ్చాక సర్ ప్రైజ్ ఉందని అన్నారని కృష్ణ అనగానే.. కొన్ని డాక్యుమెంట్స్ కృష్ణకి ఇస్తుంది. అవేంటని చూస్తే కృష్ణ కోసం హాస్పిటల్ ని కట్టించినట్టు భవానీ చెప్తుంది. కృష్ణ వాళ్ళ అమ్మ కళని నెరవేర్చిందని ఎమోషనల్ అవుతుంది కృష్ణ. ఇక భవానిని హత్తుకొని ఏడుస్తుంది కృష్ణ‌.

ఆ తర్వాత ముకుంద వస్తుంది‌. ఆ రోజు ఏదో చెప్దామని అన్నావని ముకుందని భవాని అడుగుతుంది. ‌రేవతి, మురారి, మధు అందరు టెన్షన్ పడతారు. రుమ్ మారితే బాగుంటుందని, ఆ రుమ్ వాస్తు బాగలేదంట, నా రూమ్ కాకుండా కృష్ణ, మురారిల గది అయితే బాగుంటుందని, లైఫ్ మారుతుందని ఒక శాస్త్రి గారు చెప్పారని ముకుంద కవర్ చేస్తుంది. ఆ తర్వాత కృష్ణ దగ్గరికి ముకుంద వెళ్తుంది. అప్పటికే కృష్ణ హడావిడిగా ఆఫీస్ కి రెడీ అవుతుంది. తనని చూసిన ముకుంద.. కృష్ణ నీకొకటి చెప్పాలి పదా? బయటకు వెళ్దామని అనగానే సరే వెళ్దామని అంటుంది. ఆ తర్వాత భవాని కంగారుపడుతూ మురారిని పిలుస్తుంది. అప్పుడే వచ్చిన మురారి.. ఏం అయిందని భవానిని అడుగుతాడు. ఆదర్శ్ తో కల్నల్ ఫోన్ చేయాలని ప్రయత్నిస్తుంటే అతను నిరాకరిస్తున్నాడని అంటుంది. సరే పెద్దమ్మ నేను చూసుకుంటానని మురారి అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.