English | Telugu

గుప్పెడంత మనసులో కీలక మలుపు.. రిషి నిజం చెప్పేస్తాడా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్‌ - 866 లో చక్రపాణి వాళ్ళింట్లో రిషి, వసుధార, జగతి, మహేంద్ర, చక్రపాణి అందరూ మాట్లాడుకుంటారు. రిషి మాకేంటి శిక్ష, పరిస్థితుల ప్రభావం వల్ల అది జరిగిందని జగతి అనగా.. నేనేం వినని రిషి అంటాడు. మరి ఏంజిల్ తో పెళ్ళి నీకిష్టమేనా అని మహేంద్ర అడుగగా.. నా తలరాత అలా రాసి ఉంటే చేసుకుంటానేమో అని రిషి అంటాడు. వద్దని అడ్డుచెప్పవా అని మహేంద్ర అడుగగా.. నేను విశ్వనాథ్ గారి మాటకే ఋణపడి ఉంటానని రిషి అంటాడు. అల్లుడు గారని చక్రపాణి అనగా.. ఇంకోసారి అల్లుడు గారని పిలవకండి అని, నాకు సమస్యలు తెచ్చిపెడుతుందని రిషి అంటాడు. మీరెవ్వరూ అక్కడ ఏ నిజాలు చెప్పకూడదని రిషి చెప్తాడు.

రిషి ఏంజిల్ ని పెళ్ళి చేసుకుంటే నువ్వు భరించగలవా అని మహేంద్ర అడుగగా.. నాకు సంతోషమే అని వసుధార అంటుంది‌. మరొకవైపు ఏంజిల్ జుంకాలు, నగలతో రెడీ అవుతుంది‌. అప్పుడే విశ్వనాథ్ వచ్చి ఏదో తగ్గిందని అంటాడు. పూలు పెట్టుకోవాలని వాళ్ళ పనిమనిషి చెప్పగానే అవి పెట్టుకొని వచ్చేస్తారు. ఇక కాసేపటికి రిషి వస్తాడు. ఆ తర్వాత మహేంద్ర, జగతి, వసుధార వస్తారు.

వసుధార ఏంటి నువ్వు, ఎందుకిలా చేస్తున్నావ్? రిషి పెళ్ళికి ఒప్పుకున్నాడని చెప్పిన దగ్గర నుండి కాంటాక్ట్ లో లేవని, ఈ రోజు ఎలాగైనా నిన్ను కలుద్దామని అనుకున్నాను. ఎందుకంటే నువ్వే పెళ్ళి పెద్ద అని వసుధారతో ఏంజిల్ అంటుంది. పంతులుగారు చాలా సేపటి నుండి వెయిట్ చేస్తున్నారు. రిషి నువ్వు ఫ్రెష్ అయి వస్తే ముహుర్తాలు చూస్తానని అన్నాడు పంతులు గారు‌. ఇక రిషి రెడీ అవడానికి లోపలికి వెళ్తాడు. అలా వెళ్ళగానే వసుధార తన గతాన్ని గుర్తుచేసుకుంటుంది. మన పరిచయంలో ఏం మిగిలింది.

ఈ వసుధార భవిష్యత్తు ఏంటని ఇప్పుడు మీరే నిర్ణయిస్తారు సర్ అని వసుధార తన మనసులో అనుకుంటుంది. ఎమ్ఎస్ఆర్ డిబిఎస్టీ కాలేజ్ కి వస్తాడు. ఇక శైలేంద్ర, ఫణీంద్ర ఒక కార్ లో వస్తారు. నేను మీకు ఒక పెద్ద అమౌంట్ అప్పుగా ఇచ్చానని, శైలేంద్రకి ఇచ్చానని ఎమ్ఎస్ఆర్ అంటాడు. అవును డాడ్ కానీ మా ఫ్రెండ్ వెనుకాల ఇతను ఉంటాడని నాకు తెలియదని శైలేంద్ర తప్పించుకుంటాడు. ఒక ఫైల్ తీసుకొని ఎమ్ఎస్ఆర్ కాలేజీలోకి వెళ్తాడు. మరొకవైపు రిషి కోసం జగతి, మహేంద్ర, వసుధార, విశ్వనాథ్, ఏంజిల్ అందరు ఎదురుచూస్తుంటారు. కాసేపటికి రిషి రెడీ అయి వస్తాడు. ఏంజిల్ పక్కన రిషిని కూర్చోమని విశ్వనాథ్ అనగానే కూర్చుంటాడు రిషి. పంతులు గారు ముహూర్తం చూడటానికి రాశి, నక్షత్రం అడుగుతాడు‌. దాంతో రిషి నిల్చొని.. సారీ సర్ అని అంటాడు. ఇప్పడేం ముహుర్తాలు చూడాల్సిన అవసరం లేదని పంతులిని వెళ్ళిపోమంటాడు రిషి. ఇప్పుడే చెప్పు అని విశ్వనాథ్ అనగా.. నేను వాళ్ళకైన గాయాలు చూడమనట్లేదని, వాళ్ళు నా ఆత్మీయులని రిషి అంటాడు. నన్ను ఒక ముఖ్యమైన మలుపు నుండి తప్పించడానికి వచ్చారని రిషి అంటాడు. ఇక మహేంద్ర చెప్తుంటే తనని రిషి ఆపేసి‌‌ చెప్పాల్సింది మీరు కాదు నేను అని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.