English | Telugu
దుగ్గిరాల ఇంట్లో అనుకోని అతిథి.. కావ్య వెంటే రాజ్!
Updated : Sep 13, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-199 లో.. క్రికెట్ గ్రౌండ్ లో అప్పు గొడవపడుతుంటుంది. అందులో ఒకతను వచ్చి అప్పుని వెనుకాల నుండి వచ్చి తనను కొడుతుండగా కళ్యాణ్ అతడిని చూసి అప్పుకి దెబ్బ తగలకుండా అడ్డుకుంటాడు. అప్పుడు అప్పుకి తాకాల్సిన దెబ్బ కళ్యాణ్ కి తగులుతుంది. దాంతో కళ్యాణ్ కిందపడిపోతాడు. ఆ తర్వాత పోలీస్ జీప్ సౌండ్ రాగానే అందరూ అక్కడ నుండి పారిపోతారు. ఇక అప్పు తన ఫ్రెండ్ బైక్ మీద వాళ్ళింటికి తీసుకెళ్తుంది.
కళ్యాణ్ ని ఇంటికి తీసుకెళ్ళిన అప్పు.. కంగారుపడుతూ అతని తలకి కట్టుకడుతుంది. అదంతా గమనించిన అప్పు వాళ్ళ పెద్దమ్మ అన్నపూర్ణమ్మ గమనిస్తుంది. ఇక కళ్యాణ్ వాళ్ళింటికి వెళ్తాననగా, నీకు ఈ కట్టు చూసి మీ పెద్దమ్మ మళ్ళీ ఎంత గొడవ చేస్తుందోనని అప్పు అనగా.. అదేం లేదు, నేను మేనేజ్ చేస్తానని చెప్పి కళ్యాణ్ వెళ్ళిపోతాడు. ఇక కళ్యాణ్ వెళ్ళిపోయాక అప్పు వాళ్ల పెద్దమ్మ అన్నపూర్ణమ్మ.. ఏంటి అతనికి దెబ్బ తగిలితే ఇంత ఎమోషనల్ అవుతున్నావని నీలో ఏదో మార్పు మొదలైందని అంటుంది. అవునా అని అప్పు ఆలోచిస్తుంటుంది. ఇక మరొకవైపు సీతారామయ్యతో శుభాష్, రాజ్ మాట్లాడుతుంటారు. అమెరికాలో నాకు తెలిసిన సీనియర్ డాక్టర్స్ ఉన్నారు. మనం అక్కడికి వెళ్దాం నాన్న అని సీతారామయ్యతో సుభాష్ అనగా... వద్దని, నేను ఉన్న మాతృభూమిలోనే ఉంటానని, పరాయిదేశంలో నా ప్రాణం పోతే నా ఆత్మకు శాంతి ఉండదని, నేను ఇక్కడే ఉంటానని సీతారామయ్య అనగా అప్పుడే ఇందిరాదేవి వస్తుంది. దేనిగురించి మాట్లాడుతున్నారని అడుగగా.. రాజ్, సుభాష్ ఇద్దరు టెన్షన్ పడుతుంటారు. బిజినెస్ గురించా అని ఇందిరాదేవి అనగా అవునని చెప్పి బయటకు వచ్చేస్తారు. ఆ తర్వాత అందరూ హాల్లో ఉంటారు. అప్పుడు కావ్య, రాజ్ గదిలో ఉంటారు. అప్పుడు రాజ్ వాష్ రూమ్ కు వెళ్తాడు. తనకి ఫోన్ రెండు మూడుసార్లు రావడంతో కావ్య లిఫ్ట్ చేయడానికి తీసుకోగా.. రాజ్ తొందరగా వచ్చి కావ్యని తిట్టి ఫోన్ లాక్కుంటాడు. ఇక కావ్య అలిగి కిందకి వెళ్తుంటుంది. అయ్యో తాతయ్యకి మాటిచ్చిను కదా అని కావ్య వెనుకాలే రాజ్ వెళ్లి.. కావ్య చీర కొంగు పట్టుకుంటాడు. అలా రాజ్ కావ్య చీర కొంగు పట్టుకోవడం దుగ్గిరాల ఇంటి సభ్యులంతా చూస్తారు.
ఇక అప్పుడే తలకి కట్టుతో కళ్యాణ్ వస్తాడు. అతడిని చూసి అందరు కంగారు పడతారు. ఏం అయిందని అందరూ వరుసబెట్టి అడుగుతుంటారు. కళ్యాణ్ చెప్తుండగా తన అభిమాని అనామిక వస్తుంది. ఏం అయింది అసలు ఎప్పుడు ఊహల్లో ఉంటారా? రోడ్డు మీద వాహనాలు అటు ఇటూ వెళ్తుంటాయి కదా? చూసుకోవాలి కదా అని అనామిక అనగా అందరూ ఎవరీ అమ్మాయి అని చూస్తుంటారు. నేను ఇటు మాట్లాడుతుంటే దిక్కులు చూస్తున్నావేంటని అనామిక అనగా.. మేమందరం ఉన్నాం కాబట్టి అని ఇందిరాదేవి అంటుంది. ఇక సారీ అమ్మ గారు అని అనామిక అంటుంది. తనెవరని ఇంట్లో వాళ్ళు అడుగగా.. తను నా కవితల అభిమాని అని, నా పుస్తకం అచ్చు వేసింది తనే అని అనామికని కళ్యాణ్ అందరికి పరిచయం చేస్తాడు. కాసేపటికి కళ్యాణ్ తన గదిలోకి అనామికని తీసుకొని వెళ్ళి చూపిస్తుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.