English | Telugu

ముకుంద‌ ప్లాన్ సక్సెస్.. కృష్ణ ఏం చేయనుంది?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -279 లో.. ఆదర్శ్ గురించి భవానిని అడుగుతాడు ప్రభాకర్. కానీ భవాని దానికి సమాధానం చెప్పకుండా.. టాపిక్ డైవర్ట్ చేస్తుంది.. కాసేపటికి గుడ్ నైట్ అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది భవాని. ఇంట్లో అంత బాగానే ఉంది కానీ ముకుంద విషయమే కొంచెం డౌట్ గా ఉందని ప్రభాకర్ అనుకుంటాడు. మరొక వైపు ఎప్పుడు తాగుతూనే ఉంటావా అని మధుని అలేఖ్య తిడుతుంది.

మరొకవైపు వాళ్ళ పిన్ని, బాబాయ్ ల కోసం కృష్ణ వెతుకుతుంటుంది‌. ఇక అది గమనించి కృష్ణ దగ్గరికి ముకుంద వచ్చి.. ఎవరికోసం వెతుకుతున్నావ్? మీ తొట్టి గ్యాంగ్ కోసమా అని అంటుంది. ఎందుకు అలా అంటావ్. మీ నాన్నని నేను బాబాయ్ అంటూ ఎలా పిలుస్తానని కృష్ణ అంటుంది. ఆ తర్వాత కృష్ణ వాళ్ళ బాబాయ్ ని తక్కువ చేసి మాట్లాడుతుంది ముకుంద. దాంతో కృష్ణ కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. గదిలోకి వెళ్లిన కృష్ణ.. కోపంగా ముకుంద గురించి మురారికి చెప్తుంది. సంస్కారం లేని వాళ్ళతో నీకేంటి వదిలేయ్ అని మురారి చెప్తాడు. అయిన ముకుంద మాటలనే కృష్ణ గుర్తు చేసుకుంటుంది‌. తింగరి పిల్ల లాగా ప్రవర్తిస్తుంటే, అది చూసిన మురారి.. రోజు రోజుకి నీ చేష్టలతో తెగ నచ్చేస్తున్నావ్, కృష్ణ ఐ లవ్ యు అని తన మనసులో అనుకుంటాడు మురారి. మరొక వైపు ఎలాగైన ప్రొద్దున కృష్ణ , మురారి కలిసి వెళ్లకుండా ఆపాలని ముకుంద అనుకుంటుంది. కాసేపటికి ముకుంద దగ్గరికి శకుంతల వచ్చి ఆదర్శ్ గురించి అడుగుతుంది. తను అడిగే ప్రశ్నలకు ముకుంద చిరాకు పడుతు కోప్పడుతుంది. అప్పుడే కృష్ణ, మురారి ఇద్దరు వస్తారు. దూరంగా వుండి ప్రభాకర్ కూడా చూస్తుంటాడు. మా పిన్నికి సారి చెప్పు అని ముకుందని కృష్ణ అడుగుతుంది. నేను చెప్పనని ముకుంద అంటుంది. గొడవ వద్దు. తన తరుపున నేను సారీ చెప్తున్నాని మురారి అంటాడు. ఆ తర్వాత కృష్ణని గదిలోకి తీసుకొని వెళ్తాడు మురారి.

మరొక వైపు ముకుంద చేసిన గొడవ గురించి అలేఖ్యతో మధు చెప్తాడు. మరుసటి రోజు ఉదయం కృష్ణ, మురారీ ఇద్దరు బయటకు వెళ్తుంటే భవాని వారిద్దరిని ఆపుతుంది. వేరే దగ్గరికి వెళ్లి ఆదర్శ్ గురించి తెలుసుకొని రా అని‌ మురారిని బయటకు పంపిస్తుంది భవాని. దాంతో కృష్ణ కూడ ఆగిపోతుంది. కాసేపటికి కృష్ణ బాగా ఆలోచిస్తుంటుంది. మమ్మల్ని వెళ్లకుండా చెయ్యడానికి ముకుంద ప్లాన్ చేసిందా అని కృష్ణ అనుకుంటుంది.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.