English | Telugu

వాళ్ళిద్దరిని నిజమైన భార్యాభర్తలేనా అని నిలదీసిన రేవతి!


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్‌-88 లో.. ముకుంద అంటే నీకు ఇష్టం లేదా చెప్పు రేవతి అని భవాని అడుగుతుంది. ‌దీంతో రేవతి టెన్షన్ పడుతూ.. ముకుంద పెళ్ళి అయిన నుండి ఆదర్శ్ కి దూరంగా ఉంది. కానీ తన ముందే కృష్ణ, మురారిలు హ్యాపీగా ఉంటే తను ఎలా ఉంటుందక్కా... అందుకే ఆదర్శ్ ని వెతికించమని చెప్పాలని రేవతి అనగా.. అవును నిజమే అని భవానీ అంటుంది

ఒక శుభవార్త చెప్పాలని అందరినీ పిలుస్తుంది ముకుంద. అందరూ వచ్చాక ఏంటి ముకుంద ఏదో శుభవార్త అన్నావ్? అని భవాని అడుగుతుంది. ఆదర్శ్ ని తొందరగా వెతికించి మనకి అప్పజెప్పడానికి ఢిల్లీలోని డిఫెన్స్ మినిస్టర్ కి రిక్వెస్ట్ లెటర్ రాసి పెట్టాలి.. అలా మన రిక్వెస్ట్ లెటర్ పంపిస్తే తొందరగా పని జరుగుతుందని నాకు మెయిల్ చేశారని ముకుంద అంటుంది. అవునా ఇది అందరికి శుభవార్త అని భవాని అంటుంది. నేను ఢిల్లీ వెళ్ళడానికి ఒక పోలీస్ కానీ ఆర్మీ ఆఫీసర్ కానీ కావాలి. కాబట్టి నేను మురారిని తీసుకొని వెళ్తానని ముకుంద అనగా.. మురారి ఎందుకు? మేమందరం ఉన్నాం కదా ఎవరో ఒకరం వస్తాం అని రేవతి అంటుంది. అది విని మనం వెళ్తే అక్కడ ఎన్ని రోజులు పడిగాపులు కాచినా పని జరగదు. అందుకే మురారి లాంటి పోలీస్ ఆఫీసర్ ఉంటే తొందరగా రిక్వెస్ట్ తీసుకుంటారని ముకుంద అంటుంది. అది కృష్ణ విని.. "ఆదర్శ్ తిరిగిరావడం మనకి ముఖ్యం కాబట్టి ఏసీపీ సర్ వస్తాడు" అని అంటుంది. ఆ తర్వాత మురారిని ఒంటరిగా పక్కకి తీసుకెళ్ళి మనం హ్యాపీగా ఢిల్లీ కి వెళ్దామని ముకుంద అంటుంది. దానికి మురారి ఎమోషనల్ అవుతాడు. "ఎక్కడ విలువలు.. ఏది పవిత్ర బంధం, ఏది మంగళసూత్రం, ఏది అరుంధతి నక్షత్రం.. నీకు వేదమంత్రాల సాక్షిగా పెళ్ళి అయింది.. మనసుతో ఆలోచించు ముకుంద.. నీ మాజీ ప్రేమికుడి మీదకి వెళ్తున్న నీ మనసుని ప్రశాంతంగా ఉంచి ఆలోచించు" అని మురారి చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ముకుంద పశ్చాత్తాపంతో ఏడుస్తుంది.

మరోవైపు ఢిల్లీకి వెళ్ళడానికి కృష్ణ లగేజ్ ప్యాక్ చేస్తుండగా, మురారి గదిలోకి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ తీవ్రంగా ఆలోచిస్తుంటాడు. అది చూసిన కృష్ణ.. "ఏమైంది ఏసీపి సర్.. అలా ఉన్నారు" అని అడగగా.. ఏమీ లేదని మురారి చెప్తాడు. "నేను సొల్యూషన్ చెప్పలేకపోయినా కనీసం సలహా‌ అయినా ఇస్తాను కదా.. చెప్పండి దేని గురించి ఆలోచిస్తున్నారు ఏసీపి సర్" అని అడుగుతుంది. నీ అమాయకత్వమే నన్ను నిలువునా దహించేస్తుంది కృష్ణ అని మనసులో అనుకొని ఏమీ లేదని మురారి అంటాడు. ఆ తర్వాత ‌కాసేపటికి రేవతి వచ్చి.. "మీరు నిజమైన భార్యాభర్తలేనా లేక మా అందరికోసం ఇలా యాక్ట్ చేస్తున్నారా? నిజమైన భార్యాభర్తలైతే టూర్ కి వెళ్ళాలంటే ఎగిరి గంతేయాలి కానీ తనేమో కాలేజీకి వెళ్ళాలంటుంది. నువ్వేమో ఇంకేదో నసుగుతున్నావ్" అని రేవతి అనేసరికి కృష్ణ మురారీలు ఆశ్చర్యపోతారు. అలా రేవతి వాళ్ళిద్దరిని నిలదీస్తుంది. మరి వాళ్ళిద్దరు ఎలా కవర్ చేశారో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.