English | Telugu

ఘనంగా జోర్దార్ సుజాత - రాకింగ్ రాకేష్ పెళ్లి

ఎట్టకేలకు జబర్దస్త్ రాకేష్ కి, జోర్దార్ సుజాతకు పెళ్లయిపోయింది. ప్రేమించిన అమ్మాయితోనే ఏడడుగులు వేశాడు రాకేష్. ఇరు కుటుంబాలతో పాటు జబర్దస్త్ కమెడియన్స్ వాళ్ల ఫ్యామిలీస్ కూడా హైదరాబాద్ లో జరిగిన ఈ పెళ్లి వేడుకకు వచ్చారు. ప్రస్తుతం వాళ్ళ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొత్త జంటకు అందరూ ఆశీర్వాదాలు అందజేస్తున్నారు.

రాకింగ్ రాకేష్ ఎక్కువగా పిల్లలతో స్కిట్స్ చేస్తూ ఉంటాడు. మొదట్లో ధనరాజ్ టీమ్ లో ఓ కమెడియన్ గా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత కిరాక్ ఆర్పీ-రాకింగ్ రాకేష్ పేరుతో టీమ్ లీడర్ అయ్యాడు. ఆ తర్వాత కిర్రాక్ ఆర్పీ వెళ్లిపోయేసరికి సింగిల్ టీమ్ లీడర్ గా మిగిలిపోయాడు. కొంతకాలానికి జోర్దార్ సుజాత వచ్చి టీమ్ లో యాడ్ అయ్యింది. అలా అప్పటినుంచి ఇప్పటివరకు కామెడీ చేస్తూ ఎంటర్ టైన్ చేస్తున్నాడు.

ఓ న్యూస్ ఛానెల్ లో జోర్దార్ వార్తలు చదువుతూ ఫేమస్ ఐన సుజాత, తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి మంచి క్రేజ్ తెచ్చుకుంది. జబర్దస్త్ షో చేస్తూ ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఆడియన్స్ కి తెలిసేలా రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. తమది రీల్ జోడి మాత్రమే కాదు రియల్ జోడి కూడా అని ఇప్పుడు పెళ్లి చేసుకుని నిరూపించారు. ఇక నెటిజన్స్ కూడా వీళ్లకు హ్యాపీ మారీడ్ లైఫ్ అంటూ విష్ చేస్తున్నారు.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.