English | Telugu
షాజహాన్ లాంటి ప్రేమికుడు కావాలంటున్న అష్షు రెడ్డి
Updated : Feb 24, 2023
అష్షు రెడ్డి సోషల్ మీడియాను షాక్ చేసే సెలబ్రిటీ బాంబ్. రోజూ ఏదో ఒక కోట్ తో కావొచ్చు, ఫోటో షూట్స్ తో కావొచ్చు ఫుల్ వైరల్ అవుతూ ఉంటుంది. అలాగే మరోసారి వార్తల్లో నిలిచింది. హీరోయిన్ ల రేంజ్ లో అష్షు అందాల ఆరబోసే ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. బిగ్ బాస్ లోకి వెళ్లి వచ్చిన తర్వాత నుంచి అష్షు బోల్డ్ బ్యూటీగా ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు తాజ్ మహల్ చూడడానికి ఆగ్రా వెళ్ళింది.
అసలు ప్రేమకు గుర్తు ఈ తాజ్ మహల్ అన్న విషయం అందరికీ తెలుసు. అష్షు ఇక్కడికి వెళ్లి షాజహాన్ ని ఒక కోరిక కూడా కోరుకుంది. " హే షాజహాన్, నా జీవితంలో కూడా నీలా ప్రేమించే ఒక ప్రేమికుడిని ప్రసాదించు" అని వేడుకుంది. ఇక నెటిజన్స్ "ప్రపంచంలో ఏదైనా అందమైనది ఉంది అంటే అది ఇదే...అదే మీరు చూసేది. నువ్వు అన్ని దేశాలు రాష్ట్రాలు వెళ్తున్నావ్. దేవుడు మీద నమ్మకం ఉంచు. నీ లైఫ్ లో మంచి వ్యక్తి వస్తాడు" అని కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఏ మాస్టర్ పీస్ టైటిల్ తో సిల్వర్ స్క్రీన్‌పై మీద మెరవబోతోంది అష్షు. రామ్‌గోపాల్‌వర్మతో చేసిన ఇంటర్వ్యూ ద్వారా ఈ మధ్య కాలంలో ఆమె చాలా పాపులర్ అయ్యింది.