English | Telugu

‘తంతా నా కొడకా..’ అంటూ బెదిరించిన నాగబాబు


జబర్దస్త్ ఎంత సూపర్ డూపర్ హిట్టో అందరికీ తెలుసు. ఈ షోలో స్కిట్స్ చేసిన వాళ్లంతా బిగ్ స్క్రీన్ మీద కూడా సినిమాలు చేస్తూ ఉన్నారు. అలాగే స్టేజి షోస్ , కామెడీ షోస్ చేస్తూ పేరు తెచ్చుకుంటున్నారు. అలాంటి కమెడియన్స్ లో ముక్కు అవినాష్ ఒకరు. అవినాష్ స్కిట్ చేస్తే చాలు కడుపుబ్బా నవ్వుతారు ప్రేక్షకులు. మొదట్లో అవినాష్ స్కిట్స్ ఏమంత పేలకపోయినా తర్వాత్తర్వాత బాగా మెరుగుపరుచుకున్నాడు. బిగ్ బాస్ షో లో కూడా కంటెస్టెంట్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. దీనికి కారణం ఎవరు అంటే నాగబాబు గారు అంటాడు అవినాష్.

కొత్త కొత్త స్టోరీ లైన్స్ చెప్పి ఇలా చెయ్యి అలా చెయ్యి అంటూ మంచి సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటారని చెప్పుకొచ్చాడు. పొరపాటున స్కిట్ లో తప్పు చేస్తే మాత్రం వెంటనే "తంతా నా కొడకా..ఇంకోసారి సరిగా చేయకపోతే " అంటూ బెదిరించేవారట. 'ఆయన వార్నింగ్‌ ఇస్తున్నందుకన్నా బాగా చేయాలి అని మేమంతా బాగా కష్టపడేవాళ్ళం' అంటాడు అవినాష్.

'ఈరోజు ఇంత నేం అండ్ ఫేమ్ వచ్చింది అంటే అదంతా నాగబాబు సర్ వ‌ల్లే. ఆయన అందరికి ఒక పెద్ద దిక్కుగా, ఒక తండ్రిగా ఉంటూ ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా సాల్వ్ చేస్తాడని..నేను ఉన్నానంటూ ధైర్యం ఇస్తార'ని ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు అవినాష్. నాగబాబుకి తనకి మధ్యన చక్కని రాపో ఉందని ఈరోజు ఇలా ఉండడానికి కారణం ఆయనే అంటూ ఆనందం వ్యక్తం చేసాడు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.