English | Telugu
బర్త్ డే రోజు గుడ్ న్యూస్!
Updated : Oct 1, 2023
ఈ సెప్టెంబర్ 22న రామానాయుడు స్టూడియోలో తన మూవీ 'ప్రీవెడ్డింగ్ ప్రసాద్' ఓపెనింగ్ సెర్మనీ జరిగిందని, ఇదే రోజు తన బర్త్ డే అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశాడు ముక్కు అవినాష్. "బర్త్ డే రోజు ఇంకో గుడ్ న్యూస్" పేరుతో తాజాగా తన యూట్యూబ్ ఛానల్ లో ఒక వీడియోని పోస్ట్ చేశాడు. సుకాస అనే ఫామ్ హౌజ్ లో తన పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్నాడు అవినాష్. ' ఈ ఫామ్ హౌజ్ కోసం గత రెండు సంవత్సరాలుగా ట్రై చేస్తున్నాను. ఇప్పటికి దొరికింది. ఈ పార్టీకీ నా ఫ్రెండ్స్, డైరెక్టర్స్, యాక్టర్స్ వచ్చారు. కోన వెంకట్, సాయి కుమార్, కోదండ రామిరెడ్డి, సాయి రాజేశ్ ఇంకా చాలామంది వచ్చారు. చాలా సంతోషంగా ఉంది" అని ముక్కు అవినాష్ అన్నాడు.
'ప్రీవెడ్డింగ్ ప్రసాద్' సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని, వీలైనంత త్వరగా రిలీజ్ చేస్తామని అవినాష్ అన్నాడు. ఇక అవినాష్ భార్య అనూజ ప్రెగ్నెన్సి గురించి కొన్ని విషయాలని షేర్ చేసుకుంది. "మదర్ హుడ్ గురించి మీతో పంచుకోవాలనుకున్నాను. కానీ నాకు హెల్త్ ప్రాబ్లమ్ ఉండటం వల్ల వీలు కాలేదు. ఇక నుండి మీకు టచ్ లో ఉంటాను. ఇలా అవినాష్ ని హ్యాపీగా చూడటం సంతోషంగా ఉంది" అని అనూజ అంది.
జబర్దస్త్ ఫేమ్ ముక్కు అవినాష్ ప్రస్తుతం బుల్లితెరపై కనిపించే షోస్ లో తన కామెడీ టైమింగ్ తో మంచి ఫామ్ లో ఉన్నాడు. మొదట మిమిక్రీ కళాకారునిగా గుర్తింపు తెచ్చుకున్న అవినాష్.. జబర్దస్త్ స్టేజ్ మీద తన ముక్కుతో చేసిన ఒక స్కిట్ బాగా హిట్ అయింది. అప్పట్లో ముక్కుతో చేసిన ఆ స్కిట్ కి అత్యధిక వ్యూస్ వచ్చాయి. దాంతో ముక్కు అవినాష్ ట్రెండింగ్ లోకి వచ్చాడు.
ముక్కు అవినాష్, కెవ్వు కార్తిక్ కలిసి జబర్దస్త్ స్టేజ్ మీద ఎన్నో సక్సెస్ ఫుల్ స్కిట్స్ చేసి కామెడీని పండించారు. ఆ తర్వాత సినిమాలలో కూడా అవకాశాలు రావడంతో ఇద్దరు బిజీ అయ్యారు. అయితే ముక్కు అవినాష్, అనూజ అనే అమ్మాయిని పెళ్ళి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. రెగ్యులర్ గా తన యూట్యూబ్ ఛానెల్ లో వ్లాగ్స్ చేస్తూ అప్లోడ్ చేసే అవినాష్.. తన ప్రతీ అప్డేట్ ను తన ఫ్యాన్స్ కి తెలిసేలా చేస్తున్నాడు. 'మా కొత్త ఇల్లు', 'అమెరికాలో మా అల్లరి', 'ఈసారి భోనాలకి అనూజ రాలేదు ఎందుకంటే', 'ఇద్దరు ముగ్గురు అయ్యేవేళ' అనే వ్లాగ్స్ ని తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేయగా అత్యధిక వీక్షకాధరణ పొందాయి. గత వారం క్రితం వాళ్ళ అమ్మ హాస్పిటల్ లో ఉందని వ్లాగ్ చేయగా చాలామంది స్పందించారు. రీసెంట్ గా తన భార్య అనూజది శ్రీమంతం గ్రాంఢ్ గా సెలబ్రేట్ చేశాడు ముక్కు అవినాష్.
తాజాగా తన బర్త్ డే వేడుకలని ఒక రిసాట్ లో సెలబ్రేట్ చేసుకున్నాడు ముక్కు అవినాష్. చాలా మంది స్నేహితులు, డైరెక్టర్లు ఈ పార్టీకి వచ్చారంటూ వచ్చిన ప్రతీ ఒక్కరికి థాంక్స్ చెప్పాడు. మూవీ లాంఛ్ కొన్ని రోజుల క్రితం జరిగింది. ఇప్పుడు ఇదంతా వ్లాగ్ చేసి తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేశాడు ముక్కు అవినాష్. కాగా ఇప్పుడు ఈ వీడియో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.