English | Telugu
రతిక రెమ్యునరేషన్ ఎంతో తెలుసా!
Updated : Oct 2, 2023
బిగ్ బాస్ సీజన్-7 లో అత్యంత క్రేజ్ సంపాదించుకున్న కంటెస్టెంట్ రతిక. ఈ సీజన్ ఉల్టా పుల్టా థీమ్ తో ఆకట్టుకుంటుంది. రోజుకో ట్విస్ట్ తో కంటెస్టెంట్ ఈ సీజన్ పై మరింత ఆసక్తిని కలిగేలా చేస్తున్నారు. రతికరోజ్ టైటిల్ ఫేవరెట్ గా బిగ్ బాస్ సీజన్-7లోకి అడుగుపెట్టింది. పల్లవి ప్రశాంత్ లక్కీ ఛామ్ ని రతికకి ఇవ్వడంతో వీళ్ళిద్దరు కలిసి మాట్లాడుకోవడం, ఒకే దగ్గర ఎక్కువగా ఉండటంతో మెల్లిగా వీరి మధ్య ఒక రిలేషన్ ఏర్పడింది. అయితే ఇప్పటికే హౌజ్ లో సీరియల్ బ్యాచ్ అమర్ దీప్, ప్రియాంక జైన్, శోభా శెట్టి చేసే పాలిటిక్స్ లో ఆట సందీప్, టేస్టీ తేజ తమ ఆటని మర్చిపోయి ఇండివిడ్యువల్ గా కాకుండా గ్రూప్ గా ఆడుతున్నారు. అయితే రతిక ఈ గ్రూప్ కి వచ్చేముందు దగ్గరైంది. ఇక అలా దగ్గరై పల్లవి ప్రశాంత్ పై అనవసరమైన ఆరోపణలు చేస్తూ మరింత నెగెటివిటిని సంపాదించుకుంది. ప్రిన్స్ యావర్ ని సపోర్ట్ చేస్తున్నట్టు నటించి సీక్రెట్ రూమ్ లో అతడినే అన్ డిజర్వింగ్ అని ఇవ్వడం, ఆ సీక్రెట్ రూమ్ లో మాట్లాడిందంతా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరికి చూపించడంతో రతిక క్యారెక్టర్ అందరికి తెలిసింది.
రతిక ఎలిమినేషన్ అవడానికి ప్రధాన కారణం పల్లవి ప్రశాంత్ ని మెంటల్ గా టార్చర్ చేయడమే. హౌజ్ లో కంటెంట్ కోసం ఎంతకైనా, ఏం చేయడానికైనా సిద్దమన్నట్టుగా రతిక ప్రవర్తన ఉంది. ఇక రతిక ఎలిమినేషన్ అయి స్టేజ్ మీదకి వచ్చేముందు శివాజీ, పల్లవి ప్రశాంత్ లతో అసలు మాట్లాడకపోవడంతో సీరియల్ బ్యాచ్ ప్రభావం తనమీద ఎంతుందో తెలుస్తుంది. ఇక రతికకి వారానికి 2 లక్షల చొప్పున నాలుగు వారాలకు గాను మొత్తంగా 8 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుందంట. అయితే రతికరోజ్ గ్లామర్ పరంగా తను చేయాల్సిందంతా చేసింది.