English | Telugu
డోస్ పెంచిన కృష్ణ.. ముకుంద దూకుడు ముందు నిలబడుతుందా?
Updated : Oct 1, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -276 లో.. కృష్ణ మధు ఇద్దరు కలిసి ముకుందకి బుద్ది చెప్పాలని అలోచిస్తుంటారు. ఎప్పుడు మురారి నువ్వు క్లోజ్ గా అన్ని షేర్ చేసుకుంటూ ఉంటారు కదా ఇక మీద అలా ఉండకండని మధు చెప్తాడు. దాంతో ఏంటి మురారి నేను కలిసి ఉండాలని ప్లాన్ చేయమంటే విడగొట్టాలని ప్లాన్ చేస్తున్నవా అని మధుతో కృష్ణ అంటుంది.
ఆ తర్వాత నేను చెప్పేది పూర్తిగా విను కృష్ణ అని మధు తన ప్లాన్ వివరిస్తాడు. మీరు క్లోజ్ గా ఉంటే ముకుంద ఓర్వలేక మళ్ళీ ప్లాన్స్ చేస్తూనే ఉంటుంది. అదే మీరు దూరం, దూరంగా ఉంటే ముకుంద ఏం అనదు, ఈ లోపు ఆదర్శ్ వచ్చేస్తాడని మధు చెప్పగానే.. సూపర్ అని చెప్తుంది కృష్ణ. ఆ తర్వాత కృష్ణ మల్లెపూలు కుచ్చుతుండగా ముకుంద తన దగ్గరికి వస్తుంది. ఇక ముకుందకి కోపం వచ్చేలా కృష్ణ మాట్లాడుతుంది. అలాగే ముకుంద కూడా కృష్ణకి పోటీగా మాట్లాడుతుంది. మరొక వైపు కృష్ణకి నేనంటే ఇష్టం ఉంటే నాతో తన ప్రేమ విషయం చెప్పేది కదా. కేవలం అమ్మ మాట విని మాత్రమే వచ్చిందా అని మురారి ఆలోచిస్తుంటాడు. అప్పుడే కృష్ణ మల్లె పూలు పెట్టుకొని వస్తుంది. ఏంటి ఇలా పెట్టుకున్నావంటు కృష్ణని మురారి అడుగుతాడు. ఆ తర్వాత మురారి కృష్ణ తలలో మల్లె పూలు సెట్ చేసి పెడతాడు. మరొక వైపు మధు అలేఖ్య ఇద్దరు ఎప్పటిలాగే గొడవపడుతుంటారు. అలేఖ్య మాట నెగ్గించుకోవాలని అనుకుంటుంది.
మరొక వైపు కృష్ణ అన్న మాటలు గుర్తుచేసుకుంటూ ముకుంద కోపంగా ఉంటుంది. అప్పుడే ముకుంద దగ్గరికి అలేఖ్య వస్తుంది. ఏంటి ఇలా ఉన్నావని అలేఖ్య అడుగగా.. కృష్ణ గురించి చెప్తుంది. ఆ తర్వాత అందరు ఆదర్శ్ వస్తాడని అనుకుంటున్నారు.. కానీ రాకుండా మనం చెయ్యాలని అలేఖ్యకి చెప్తుంది ముకుంద. మరొక వైపు ఇంట్లో అందరిని భవాని పిలిచి వినాయక చవితికి అన్ని ఏర్పాట్లు చెయ్యాలని చెప్పగానే.. నేను చూసుకుంటానని కృష్ణ అంటుంది. కాసేపటికి మురారి కృష్ణకి దగ్గరగా వెళ్తాడు.. కానీ మధు చేసిన ప్లాన్ వల్ల మురారికి కొంచెం దూరంగా కృష్ణ జరుగుతుంది. ఆ తర్వాత కృష్ణ వాళ్ళ బాబాయ్ భవానికి ఫోన్ చేస్తాడు. కాసేపటికి కృష్ణ వాళ్ళ బాబాయ్ భవాని ఇంటికి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.