English | Telugu
ఎగ్జామ్ హాల్ లో వసుధారని ఆటపట్టించిన కేడీబ్యాచ్!
Updated : Jun 7, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -782 లో... మహేంద్రని జగతితో ధరణి మాట్లాడమని చెప్తుంది. రిషికి మంచి చెయ్యాలని చూసినా, అసలు నిజం చెప్పకుండా రిషి వెళ్లడానికి కారణమైన వాళ్ళతో నేను మాట్లాడాలని అనుకోవట్లేదని మహేంద్ర అంటాడు. అప్పుడే జగతి అక్కడికి వస్తుంది. ఇంకెప్పుడు ఎవరి గురించి నా దగ్గర మాట్లాడకని మహేంద్ర చెప్పి వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత మీరందరు ఇలా ఉంటే నాకు నచ్చడం లేదు అత్తయ్య.. మీరు రిషి మంచి కోసమే చేసారని నాకు తెలుసు కానీ అసలు నిజం చెప్పకుండా మీరు ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటారు. మీరు బంధం అనే కట్టుబాటు దాటినప్పుడే మీరు నిజాన్ని చెప్పగలరని ధరణి అనగానే.. నువ్వు చాలా ఎదిగి పోయావ్ ధరణి బాగా మాట్లాడుతున్నావని జగతి అంటుంది. నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షేమించండి అత్తయ్య.. కానీ మీరే రిషి, వసుధారలు ఇంటికి వచ్చేలా చెయ్యాలని ధరణి అంటుంది.
వాళ్ళు అసలు ఎక్కడ ఉన్నారో తెలిస్తే కదా తీసుకురావడానికని జగతి అంటుంది. మరొకవైపు వసుధార కేడి బ్యాచ్ ఎగ్జామ్స్ రాసే క్లాస్ కె ఇన్విజిలేటర్ గా వెళ్తుంది. మేడం కేడి బ్యాచ్ తో జాగ్రత్త అని మరొక మేడం వసుధారతో చెప్తుంది. మీరేంటి ఇలా చెప్తున్నారని వసుధార అంటుంది. మేడం అక్కడ ఉంది కేడి బ్యాచ్.. అందుకే ఇలా చెప్తున్నా అని వసుధారతో మరొక మేడం అంటుంది.
ఆ తర్వాత వసుధార క్లాస్ కి వెళ్తుంది. అందరూ ఎగ్జామ్స్ రాస్తుంటే ఆ కేడి బ్యాచ్ మాత్రం టైం పాస్ చేస్తుంటారు. ఒకరు కాలిగా కూర్చుంటే.. మరొకరు డ్రాయింగ్ వేస్తారు. ఇలా చేస్తుంటే వసుధారకి కోపం వచ్చి.. ఏం చేస్తున్నారని అడుగుతుంది. వసుధారకి ఇంకా కోపం వచ్చేలా అందరూ తలతిక్క సమాధానాలు చెప్తారు. ఆ తర్వాత వసుధార ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్లి కేడి బ్యాచ్ గురించి చెప్తుంది. మేడం మాకు కేడి బ్యాచ్ చేసేది అంత అలవాటు అయిందని ప్రిన్సిపాల్ అంటాడు. సర్ నేను వాళ్ళని అలా వదిలెయ్యలేనని వసుధార అంటుంది.
చైర్మన్ సర్ కి కంప్లెయింట్ ఇస్తానని వసుధార అంటుంది. ఆ మాట విన్న అక్కడ క్లర్క్.. కేడి బ్యాచ్ కి వెళ్లి చెప్తాడు. మన గురించి చెప్పడానికి ఇంతవరకు ఎవరు చైర్మన్ వరకు వెళ్లేలేదు. ఈ మేడం సంగతి మా డాడ్ కి చెప్తానని పాండియన్ అంటాడు. మరొకవైపు రిషి, వసుధార, జగతి, మహేంద్రలు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ.. జరిగిందంతా గుర్తుచేసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.