English | Telugu
దుర్గమ్మ మాలలో ముద్దమందారం నీలాంబరి
Updated : Oct 27, 2023
సునంద మాలశెట్టి తెలుగు సీరియల్స్ నటిస్తూ ఆడియన్స్ కి బాగా దగ్గరయింది. ఆమె ముద్ద మందారం సీరియల్ లో నీలాంబరి రోల్ ద్వారా ప్రతీ తెలుగు ఇంటికి పరిచయమయ్యారు. ఆ తర్వాత నిన్నే పెళ్లాడతా, నా పేరు మీనాక్షి, పవిత్ర బంధం, హిట్లర్ గారి పెళ్లాం మొదలైన సీరియల్స్‌లో నటించింది. 2008లో సునంద ఆటా జూనియర్స్ షోలో ఒక టీములో డాన్సర్‌గా తన కెరీర్ ని స్టార్ట్ చేసింది. అలాగే ఎన్నో డాన్స్ షోస్ కూడా ఇచ్చింది.
కాకినాడలో జరిగిన గోకులంలో సీత సీరియల్ ఆడిషన్స్ కి వెళ్లి సెలెక్ట్ అయ్యింది. ఈ సీరియల్ ద్వారా ఆమె తెలుగు టీవీ ఇండస్ట్రీలోకి తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఇక ఈమె డిసెంబర్ 17, 2022న శంకర్‌ని పెళ్లి చేసుకుంది. అలాంటి సునంద ఇప్పుడు దుర్గమ్మ మాలలో కనిపించారు. ఆ వీడియోని ఆమె తన యూట్యూబ్ లో పోస్ట్ చేశారు.
లాస్ట్ టైం కూడా వేసుకున్నానని ఐతే అప్పుడు తన అమ్మమ్మ ఇంట్లో దుర్గా దేవి దగ్గ్గర అలంకరణ అంతా చేస్తే తానూ మాత్రం గుడికి వెళ్లి వచ్చినట్లు చెప్పారు. కానీ ఇప్పుడు తన అమ్మమ్మ లేరని చెప్పారు. అలాగే ఇది రెండో సారి మాల వేసుకుంటున్నట్లు చెప్పారు. ఇక ఇంటికి వచ్చి అమ్మవారికి ఎలా పూజ చేసుకున్నారో చూపించింది సునంద. తక్కువగా మాట్లాడుతూ ఎక్కువగా అమ్మవారిని స్మరించుకోవాలి అని చెప్పింది. ఇక మొదటి సారి అత్తగారింటిలో రెండో సారి పుట్టింట్లో ఈ మాల వేసుకున్నట్లు చెప్పింది. అలాగే తనకు తన అమ్మమ్మ నేర్పించిన విధానంలో తనకు వచ్చినట్టుగా అమ్మవారికి పూజ చేసుకున్నది సునంద.