English | Telugu

మా అమ్మ సూపర్ యూట్యూబ్ ఛానల్ త్వరలో అశ్విని శర్మ

యాంకర్ అశ్వినీ శర్మ గురించి అందరికీ తెలుసు. ఈమె ఎన్నో మూవీ ఈవెంట్స్ కి హోస్ట్ చేయడం, సెలెబ్స్ ని ఇంటర్వ్యూ చేయడం మనం చూసాం. కొన్నాళ్లుగా ఈమె షోలకు వాటికి దూరంగా ఉంటుంది. తన యూట్యూబ్ ద్వారా అభిమానులతో టచ్ లోనే ఉంటుంది. ఈమె ప్రతీక్ అనే సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ ను పెళ్లి చేసుకుని యూఎస్ లో సెటిల్ అయ్యి రీసెంట్ ఒక బిడ్డకు తల్లి కూడా అయ్యింది. అలాంటి అశ్విని శర్మ ఇప్పుడు తన కొత్త యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేయబోతోంది.

దానికి సంబందించిన లేటెస్ట్ అప్ డేట్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. " అందరికీ హేయ్, మీకు నేను యాంకర్‌గా యాక్టర్ గా తెలుసు..ఐతే ఇప్పుడు నేను మరో కొత్త రోల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అదే - అమ్మ పాత్ర ! నేను ఒక సరికొత్త యూట్యూబ్ ఛానెల్ "మా అమ్మ సూపర్" ని ప్రారంభించబోతున్నాను. ఇక ఈ విషయాన్నీ మీతో షేర్ చేసుకోవడం సంతోషంగా ఉంది. నా ఛానల్ లో తల్లిగా నా జీవితంలో జరిగే అన్ని విషయాలను స్పెషల్ కంటెంట్‌ తో మీ ముందుకు రాబోతున్నాను.

మీ విలువైన క్షణాలను మీతో షేర్ చేసుకోవాలని, నా అభిప్రాయాలను పంచుకోవాలని అనుకుంటున్నా ఈ అద్భుతమైన ప్రయాణంలో మీరు కూడా మాతో భాగం కావాలని కోరుకుంటున్నాను. కాబట్టి, దయచేసి నా ఛానెల్‌ ని సబ్స్క్రయిబ్ చేసుకుని వీడియోస్ ని చూడండి" అని అశ్విని శర్మ కోరారు. ఇక ఈ ఛానెల్ త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోతున్నట్లు తన కూతురు ఆర్నా ప్రతీక్ ని ఎత్తుకుని ఒక ఫోటోని కూడా టాగ్ చేసి ఈ విషయాన్నీ షేర్ చేసుకుంది. ఇక నెటిజన్స్ మాత్రం ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేసేసుకున్నాం అని కామెంట్స్ పెట్టారు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.