English | Telugu
రుద్రాణి చెంతకు చేరిన మోనిత బిడ్డ
Updated : Dec 21, 2021
బుల్లితెరపై మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటూ టాప్ లో కొనసాగుతున్న సీరియల్ `కార్తీక దీపం`.ఈ బుధవారం 1229 వ ఎపిసోడ్ లోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా ఈ రోజు ఎపిసోడ్ లోపలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. తన బిడ్డ ఎక్కడున్నాడో అని ఆలోచిస్తూ వుంటుంది మోనిత.. అంతే కాకుండా మీ అమ్మ నిన్ను ఖచ్చితంగా కనిపెడుతుందని ఎందుకంటే మీ అమ్మ పేరు మోనితా కార్తీక్ కాబట్టని .. మోనిత తనలో తానే మైండ్వాయిస్ వేసుకుంటుంది.
Also read:సన్నీని బిగ్ బాస్ 5 విజేతగా చేసింది.. ఈ మాటే!
ఇంతలో శ్రావ్య రావడాన్ని గమనించి నేను కాఫీ కలిపివ్వనా అంటుంది మోనిత.. నువ్వు కాఫీనే కాదు వరుసలు కూడా బాగా కలుపుతావ్.. అవసపరం లేని వరుసలన్నీ ఈ ఇంటి ని వదిలేపి వెళితే.. మేం చాలా పసంతోషిస్తాం అంటాడు ఆదిత్య. వెంటనే నువ్వే బాబుని దాచావంటూ ఎదురుదాడికి దిగుతుంది మోనిత.. నాకేం అవసరం నేనెందుకు దాస్తానంటూ ఫైర్ అవుతాడు ఆదిత్య... కట్ చేస్తే శ్రీవల్లి ఇంట్లో మోనిత కొడుకు ఆనందరావు గుక్కపట్టి ఏడుస్తుంటాడు.. శ్రీవల్లి, దీప పిల్లలు పిల్లాడి ఏడుపు మాన్పించాలని ప్రయత్నిస్తుంటారు.
Also read:పెళ్లి ఒకరితో, ఫస్ట్ నైట్ ఇంకొకరితో.. తమన్ సంచలన వ్యాఖ్యలు!
పిల్లాడి ఏడుపు విన్న కార్తీక్ నిద్రకొచ్చాడేమో అని అక్కడికి వచ్చి ఎత్తుకుంటాడు. వెంటనే పిల్లాడు ఏడుపు ఆపేస్తాడు. ఇది పిల్లలకు ఏమీ అర్థం కాదు. కట్ చేస్తే శ్రీవల్లి భర్తతో కలిసి బయటికి వెళుతుంది. ఎదురుగా వస్తున్న రుద్రాణి శ్రీవల్లి, కోటేశ్వరరావు చేతుల్లో వున్న బిడ్డని చూసి తనకు చూపించమంటుంది. ఆ తరువాత కోటేశ్వర్ రావు, శ్రీవల్లి దంపలకు దీపని, కార్తీక్ ని చూసుకుని ఎగిరెగిరిపడకంటూ వార్నింగ్ ఇస్తుంది. ఆ తరువాత ఏం జరిగింది? .. మోనిత .. సౌందర్య తో ఏమంది?.. ఆమెకు కోపం ఎందుకు తెప్పించింది? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.