English | Telugu
సన్నీని బిగ్ బాస్ 5 విజేతగా చేసింది.. ఈ మాటే!
Updated : Dec 21, 2021
బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్ విజేతగా వీడియో జాకీ సన్నీ నిలిచాడు. రూ. 50 లక్షల ప్రైజ్‌మనీతో పాటు ట్రోఫీని అందుకున్నాడు. మిగతా 18 మంది కంటెస్టెంట్లతో పోటీపడి, ఆడియెన్స్ అభిమానాన్ని చూరగొని, టాప్ 5 ఫైనలిస్టుల్లో ఒకడిగా నిలిచి, చివరకు విన్నర్ అయ్యాడు సన్నీ. అతని విజయ రహస్యం ఏమిటి? దానికి ఆన్సర్ అతనే చెప్పాడు. ఒక మాట తనను బిగ్ బాస్ హౌస్‌లో నడిపించిందనీ, అదే తనను విజేతగా నిలిపిందనీ అతను చెప్పాడు.
Also read:సిరి, షన్ను రిలేషన్ పై సన్నీ కామెంట్
"బిగ్ బాస్ హౌస్‌లో ఒక వార్ ఉండె. అక్కడ జరిగిన ఫైట్‌కి మేమంతా మా బెస్ట్ ఇచ్చాం. టాప్ 5 కంటెస్టెంట్స్ గురించి మరీ చెప్పాలంటే హౌస్ లోపల వెరీ వెరీ హార్డ్. ఒక్కటే ఒక్క వర్డ్ నన్ను నడిపించింది. అది.. 'కప్పు ముఖ్యం బిగులూ' అన్నది." అని తెలిపాడు సన్నీ. సోమవారం సాయంత్రం ఏర్పాటుచేసిన మీడియా మీట్‌లో అతను హుషారుగా, ఒకింత ఉద్వేగంగా తన ఆనందాన్ని పంచుకున్నాడు.
Also read:బిగ్‌బాస్ 'వీజే'త సన్నీకి దక్కింది ఎంత?
"మా అమ్మ వచ్చి నన్నడిగింది. 'బేటా.. నీ చిన్నప్పట్నుంచీ నేనేమీ అడగలేదు, కప్పు ఇయ్యరా' అని. దాంతో నేను ఫిక్సయిపోయా, వార్ వన్‌సైడ్ చేద్దామని. జెన్యూన్‌గా, నాకు నేనులాగా ఉండాలని అనుకున్నా. మనస్ఫూర్తిగా మనల్ని ఇష్టపడేవాళ్లుంటే, నువ్వెక్కడుంటే అక్కడే నీ రాజ్యం స్టార్టవుద్ది. దాన్ని నేను ఫీలయ్యాను." అని సన్నీ తెలిపాడు.