English | Telugu

అఖిల్ విష‌యంలో యానీ మాస్టర్‌కు మోనాల్ వార్నింగ్!

బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ లుగా పాల్గొన్న అఖిల్-మోనాల్ ల గురించి అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ గురించి రకరకాల వార్తలు వస్తుంటాయి. ఇద్దరూ ప్రేమించుకుంటున్నారనే వార్తలు వచ్చిన ప్రతీసారి ఈ జంట కొట్టిపారేస్తుంటుంది. కానీ అఖిల్-మోనాల్ ఎంతో సన్నిహితంగా ఉంటుండడంతో సోషల్ మీడియాలో వీరికి సంబంధించిన ప్రతీ విషయం ట్రెండ్ అవుతుంటుంది. బిగ్ బాస్ హౌస్ లో ఈ జంట ఎన్నో సార్లు గొడవ పడింది. కానీ తిరిగి కలిసిపోయేవారు.

హౌస్ నుండి అఖిల్ కంటే ముందే ఎలిమినేట్ అయిన మోనాల్.. అతడి విజయం కోసం బాగానే శ్రమించింది. కానీ చివరికి అభిజిత్ గెలిచాడు. ఇదిలా ఉండగా.. హౌస్ నుండి బయటకొచ్చిన తరువాత కూడా అఖిల్-మోనాల్ ఎంతో ప్రేమగా మెలుగుతున్నారు. స్పెషల్ సర్ప్రైజ్ లు, గిఫ్ట్ లు అంటూ తెగ హడావిడి చేస్తున్నారు. తాజాగా వీరిద్దరి బంధంపై కొరియోగ్రాఫర్ యానీ మాస్టర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. యానీ మాస్టర్, మోనాల్ ఇద్దరూ డాన్స్ ప్లస్ షోలో జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ షో షూటింగ్ జరుగుతోన్న సమయంలో ఇద్దరూ కలిసి అఖిల్ గురించి ముచ్చట పెట్టుకున్నారు.

యానీ మాస్టర్ మాట్లాడుతూ.. మోనాల్-అఖిల్ కి సంబంధించిన పోస్ట్ లు పెడుతున్నప్పుడు ఫ్యాన్స్ అందరూ తనను కూడా ట్యాగ్ చేస్తున్నారని.. వాళ్ల మధ్యలో నేనెందుకు చెప్పండి అంటూ కామెంట్ చేశారు. దీంతో పక్కనే ఉన్న మోనాల్ కాస్త సీరియస్ అవుతూ.. "ఇప్పుడు అఖిల్ పేరు ఎందుకు తీసుకొచ్చారు?" అంటూ ఆమెతో ఫన్నీగా గొడవకు దిగింది. దీంతో యానీ మాస్టర్.. "నేను అఖిల్ గురించి మంచే మాట్లాడాను కదా..?" అంటే.. దానికి మోనాల్.. ఏదైనా సరే అఖిల్ గురించి మాత్రం మాట్లాడొద్దని సీరియ‌స్‌గా చెప్పింది.

ట్రెండింగ్ లో కావ్య, సుధీర్ జోడి.. మల్టీ టాలెంటెడ్ మెజీషియన్ తో వివాహ యోగం

ఆట గ్రాండ్ లాంఛ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోలో ఉన్న కావ్య మీద సుధీర్, సుధీర్ మీద నిహారిక ఫుల్ సెటైర్స్ వేసుకున్నారు. "మీ గురించి రికమెండ్ చేసి మరీ తీసుకొచ్చాను. ఎలాగున్నా నాకు మంచి పేరు తేవాలి" అన్నాడు. దాంతో కావ్య ఏమీ తెలీనట్టు నవ్వింది. ఆమెను చూసి జానీ మాష్టర్ నవ్వాడు. ఇక సుధీర్ ఆమె గురించి ఒక పెద్ద బయోడేటా లిస్ట్ రాసుకొచ్చాడు. "పేరు కావ్యశ్రీ, ముద్దుపేరు నడిచే తాజ్ మహల్, ఎగిరే ఎల్లోరా, కదిలే కాశ్మీర్" అన్నాడు. వెంటనే నిహారిక "అవన్నీ హనీమూన్ డెస్టినేషన్స్" అనేసరికి సుధీర్ షాకయ్యాడు.