English | Telugu
లేగదూడ మూతిని ఎందుకు కట్టేశామో తెలుసా?.. కౌంటర్ ఇచ్చిన సుమ!
Updated : May 1, 2021
యాంకర్ సుమ తన టీవీ షోలతో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటారు. సాధారణంగా సుమపై నెగెటివ్ కామెంట్స్ కానీ.. ట్రోలింగ్ కానీ జరగదు. మహా అయితే ఆమెపై ఫన్నీ కామెంట్స్ చేస్తుంటారు. అయితే తాజాగా ఆమె సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురయ్యారు. దానికి కారణం ఏంటంటే.. రీసెంట్ గా సుమ లేగదూడతో ప్రేమగా ఆడుకుంటున్న వీడియోను షేర్ చేశారు. అయితే ఆ లేగ దూడ మూతిని కట్టేయడంతో నెటిజన్లు ఫైర్ అయ్యారు. ఆవు పాలతో వ్యాపారం చేసేవారు లేగదూడల విషయంలో కాస్త కఠినంగా ఉంటారు.
సుమ షేర్ చేసిన వీడియోలో లేగదూడ మూతికి వెదురు బుట్టి కట్టేయడంతో నెటిజన్లు ఆమెని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఆవు పాలు లేగ దూడకు చెందాలి.. అలా కాకుండా మీరు దాని మూతిని కట్టేసి ఆవు పాలను అమ్ముకుంటున్నారా..? అంటూ సుమను ప్రశ్నించారు. ఈ విషయంలో చాలా మంది సుమకు మద్దతుగా నిలిచారు. లేగదూడ చిన్నది కాబట్టి చెత్తా చెదారాన్ని తినకుండా అలా కట్టి ఉంటారని సుమకి సపోర్ట్ గా పోస్ట్ లు పెట్టారు.
తనపై జరుగుతోన్న ట్రోలింగ్ కి గట్టి సమాధానం ఇవ్వాలని నిర్ణయించుకున్న సుమ మరో వీడియో షేర్ చేశారు. అందులో లేగదూడను పట్టుకొని ఉన్న పాలేరుని.. రాముడి (లేగదూడ) మూతికి మొన్న బుట్టి ఎందుకు కట్టారని సుమ ప్రశ్నించారు. దానికి అతడు మట్టిని తినకుండా ఉండడానికి అలా కట్టానని చెప్పుకొచ్చాడు. ఆవును పెంచుకుంటోంది.. దాని పాలతో వ్యాపారం చేసేందుకు కాదు.. గోమూత్రంతో మంచి ఎరువు వస్తుందని.. ఆవు ఉంటే మంచిదని పెంచుకుంటున్నామని సుమ చెప్పుకొచ్చారు.