English | Telugu
చాలా మిస్సవుతానంటూ రోజా ఎమోషనల్
Updated : Apr 15, 2022
ఈటీవీ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ షోలో దాదాపు పదేళ్ల పాటు జడ్జిగా వ్యవహరించారు రోజా. 2013 నుంచి ఇప్పటి వరకు ఈ షో నుంచి నాగబాబు ఎగ్జిట్ అయ్యాక అన్నీ తానై నడిపిస్తూ టీమ్ లీడర్ లని ఎంటర్‌టైన్ చేస్తూ వచ్చారు. తాజాగా ఆమె ఏపీ మంత్రి వర్గంలో పర్యాటక శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడంతో జబర్దస్త్ షో జడ్జి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అయితే పదేళ్లుగా కలిసి ప్రయాణించిన రోజా ఈ సందర్భంగా జబర్దస్త్ టీమ్‌ని వదిలి వెళ్లిపోతున్న నేపథ్యంలో ఎమోషనల్ అయ్యారు.
రోజా జడ్జిగా వ్యవహరించిన చివరి `ఎక్స్ ట్రా జబర్దస్త్` ఎపిసోడ్ కి సంబంధించిన తాజా ప్రోమోని విడుదల చేశారు. రెండు నిమిషాల పాటు సాగిన ఈ ప్రోమోలో రోజా ఏడుస్తూ కనిపించారు. తను ఏడుస్తూ అందరిని ఏడిపించారు. ఈ సందర్భంగా లీడర్ లీడర్ అంటూ జబర్దస్త్ టీమ్ మంత్రి రోజాను ప్రత్యేకంగా సన్మానించి వీడ్కోలు పలికారు. ప్రౌడ్ మూవ్‌మెంట్ అంటూ యాంకర్ రష్మీ కంగ్రాట్స్ చెప్పగా.. సుడిగాలి సుధీర్ వెళ్లి రోజాని తీసుకుని రావడం.. తను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వీడియోని ఆమెకు మల్లెమాల ఎంటర్ టైన్ మెంట్స్ శుభాకాంక్షలు తెలపడం ఆకట్టుకుంటోంది.
ఈ సందర్భంగా రోజా భావోద్వేగానికి గురయ్యారు. `నేను రెండు సార్లు ఎమ్మెల్యేగా ఇక్కడి నుంచే అయ్యాను. మినిస్టర్ కూడా ఇక్కడే అవ్వాలనుకున్నా..మనస్ఫూర్తిగా నేను నమ్మాను కాబట్టే ఇక్కడికి వచ్చాను. ఇక నుంచి ఈ షో చేయడం కష్టమే. అందర్నీ మిస్ అవుతున్నాను. ఆ బాధ నాకు చాలా వుంది. నాకు ఇష్టమైనవి కూడా వదులుకోవాల్సి వస్తుంది. నా లైఫ్ లో నేను కోరుకున్న గోల్ రీచ్ అయ్యేలా చేశారు. ఈ విషయంలో ఈటీవీకి థ్యాంక్స్ అంటూ ఎమోషనల్ అయ్యారు.