English | Telugu
అషురెడ్డి కి రంగుపడింది.. నటరాజ్ పగలగొట్టేస్తాడట
Updated : Apr 16, 2022
అఖిల్ కారణంగా అతని గ్రూప్ కారణంగా అషురెడ్డి హౌస్ లో కెప్టెన్ అయిన విషయం తెలిసిందే. తనకే రంగుపడింది. ఇంటి సభ్యుల్లో ఎవరు వరస్ట్ పెర్ఫార్మర్ అని అనుకుంటున్నారో వారి ముఖంపై స్టాంపు వేసి తగిన కారణాలు చెప్పాలని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. వెంటనే రంగంలోకి దిగిన నటరాజ్ మాస్టర్ "ఈ స్టాంప్ ని నాకు నేను వేసుకోవాలి" అన్నాడు. "అట్లుండది మాస్టర్ తోని" అని అఖిల్ అనడంతో "అది వుండదు కాబట్టి అషురెడ్డికి వేస్తున్నా" అనేశాడు. దీంతో "ఇదేం ట్విస్ట్" అని మిగతా ఇంటి సభ్యులు నవ్వేశారు.
ఇక ఆ తరువాత లైన్ లోకి వచ్చిన అరియానా తాను రేషన్ మేనేజర్ గా ఫెయిలయ్యానని, దానికి కారణాలు ఇవే అంటూ అషురెడ్డి వైపు చూసింది. నువ్వు రేషన్ ఫాలో అవ్వలేదని, టేకిట్ ఈజీ తీసుకున్నావని అషురెడ్డి అనేసింది. దీంతో "అవును చాలా టేకిట్ ఈజీగా తీసుకున్నాను" అంటూనే అషు రెడ్డికి స్టాంప్ వేసి షాకిచ్చింది. ఆ తరువాత అఖిల్, మహేష్ విట్టా వెంట వెంటనే అషుకు స్టాంప్ లు వేసేశారు. ఇక క్లారిటీ, విజన్, లాట్ ఆఫ్ కన్‌ఫ్యూజన్ అంటూ స్టాంప్ ని గుద్దిపడేసింది మిత్రా. దీంతో అషురెడ్డి వరస్ట్ పెర్ఫార్మర్ ఆఫ్ ది హౌస్ గా నిలిచింది.
ఇక తన వంతు వచ్చేసరికి అషురెడ్డి.. అనిల్ ని టార్గెట్ చేసింది. ఫ్లాగ్ టాస్క్ లో 'దమ్ముంటే నువ్వు రావాలి కానీ ఆడపిల్లని పంపించడం ఏంటీ?' అని అన్నాడని అషు స్టేట్‌మెంట్ ఇవ్వడంతో అనిల్ వెంటనే కలగజేసుకుని తాను అలా అనలేదని వాదించాడు. అయినా అషు పదే పదే వాదిస్తుండటంతో ఈ సారి వస్తే పగలగొట్టి చూపిస్తానని, తనకు గేమ్ లేకపోయినా ఫరవాలేదని, గ్యారెంటీగా పగలగొట్టే వెళతానని నటరాజ్ మాస్టర్ అనడంతో 'ఎవరిని మాస్టర్?' అని అనిల్ అందుకున్నాడు. 'ఎవరిని అనేది పేరు తియ్యలేదు కదా నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావ్' అని అఖిల్ అనడం.. నటరాజ్.. అనిల్ సై అంటే సై అనడం నానా రచ్చకు దారితీసింది.