English | Telugu
'ఢీ'లో మొదలైన రవికృష్ణ - నవ్య స్వామి ప్రేమ రచ్చ
Updated : Apr 15, 2022
బుల్లితెర జంట నవ్య స్వామి, రవికృష్ణలు తొలిసారి కలిసి చేసిన `ఆమె కథ` సీరియల్ ఎంత పాపులర్ అయిందో అందరికి తెలిసిందే. ఈ సీరియల్ నుంచి ఈ ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ మొదలైంది. ఆన్ స్క్రీన్ లో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కుదరడంతో వీరిపై అందరి దృష్టిపడింది. ఇద్దరి మధ్య అనుబంధం మరింత పెరగడం.. పలు టీవీషోల్లో ఇద్దరు మరింత క్లోజ్ గా మూవ్ కావడంతో రక రకాల రూమర్ లు మొదలయ్యాయి. ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది?.. అనే ఊహాగానాలు మొదలయ్యాయి.
నవ్య స్వామి కంటే రవికృష్ణ ప్రతీ ఈవెంట్ లోనూ నవ్య గురించి రియాక్ట్ కావడంతో ఇద్దరి మధ్య ప్రేమ నడుస్తోందని, వీరు త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే వార్తలు జోరుగా వినిపించాయి. దీంతో ఇద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని, మా మధ్య అలాంటిది ఏమీ లేదని ఇద్దరూ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. బయటికి స్నేహితులమే అని చెబుతున్నా ఏదైనా షోలోకి ఎంట్రీ ఇచ్చారా..ఆ వేదికపై వీరు చేసే రచ్చ మామూలుగా వుండటం లేదు. లవర్స్ తరహాలో రెచ్చిపోయి జీవించేస్తున్నారు.
సుమ నిర్వహిస్తున్న `క్యాష్` షో లో అయితే ఏకంగా ముద్దులు కూడా పెట్టేసుకుని షాకిచ్చారు. హగ్గులు, ముద్దులు చూసి సుమ స్టేజ్ పై ఏం జరుగుతోందనే షాక్ కు గురికావాల్సివచ్చింది. అంతలా సుమని ఈ జంట భయపెట్టేసింది. తాజాగా ఈ జంట ఢీ షోలో సందడి చేస్తున్నారు. ఈ షోలో వీరిద్దరి మధ్య వున్న అనుబంధాన్ని బయటపెట్టే ప్రయత్నం చేశాడు ప్రదీప్. మీకు రవికృష్ణ ఇచ్చిన మొదటి గిఫ్ట్ ఏంటో గుర్తుందా? అని అడిగాడు. హైదరాబాద్ లో షాపింగ్ చేసినప్పడు ఓ జాకెట్ నాకు నచ్చింది. అయితే అది నా సైజ్ కాదు. దీంతో ఎందుకులే అని వదిలేశాను. దాన్ని గుర్తు పెట్టుకున్న రవికృష్ణ అంతటా వెతికి చివరికి బెంగళూరులో దాన్ని సాధించాడు. అదే నాకు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చాడు` అని అసలు విషయం బయటపెట్టింది. తాజాగా ఢీ ప్రోమోలో నవ్వ స్వామి చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.