English | Telugu

స్వప్నని కిడ్నాప్ చేయడానికి వెయిటర్స్ గా వచ్చిన రౌడీలు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -119 లో.. నగలు వేసుకొని స్వప్న రెడీ అవుతుందని అందరూ అనుకుంటారు. దుగ్గిరాల ఇంటికి వెళదామని అందరూ హాల్లోకి వస్తారు. ఆ నగలు నావి కదా అని మీనాక్షి అంటుంది. అవును దుగ్గిరాల ఇంటికి కోడలు అయ్యాక మా అయన నాకు అన్ని డైమండ్ వి కొనిస్తాడు, వీటితో నాకేంటని స్వప్న పొగరుగా మాట్లాడుతుంది. ఇక అందరూ ఈ జన్మలో ఇది మారదని అనుకుంటారు.

మరొకవైపు స్వప్నని రాహుల్ కిడ్నాప్ చేయడానికి ఏర్పాటు చేసిన రౌడీలు దుగ్గిరాల ఇంటికి రాగానే లోపలికి వెళ్లకుండా సెక్యూరిటీ ఆపుతాడు. ఆ తర్వాత మేనేజ్ చేసి లోపలికి వెళ్తారు. అటుగా వస్తున్న రాజ్ వాళ్ళని చూసి మీరంతా ఎవరని, మిమ్మల్ని ఎవరు పిలిచారని రాజ్ అడుగుతాడు. వెయిటర్స్ అని రౌడీలు చెప్తారు. ఆ తర్వాత రాహుల్ దగ్గరికి వెళ్ళి రౌడీలు మాట్లాడుతారు. అందులో 'మైఖేల్ మదన కామరాజు' నా కాబోయే భార్య ఎక్కడ అని స్వప్నని ఉద్దేశించి అడుగుతాడు. అదిగో వస్తుంది అంటూ స్వప్నని చూపిస్తాడు రాహుల్. ఆ తర్వాత స్వప్న వస్తుంటే మీడియా వాళ్ళు స్వప్నతో మాట్లాడటానికి ట్రై చేస్తుంటారు. స్వప్న మీడియా వాళ్ళు తనతో మాట్లాడాలని చూస్తుంటే.. నేను సెలబ్రిటీ అయిపోయాను అని అనుకుంటుంది. ఇంటర్వ్యూ తీసుకుంటారేమోనని అనుకుంటూ ఎక్సయిట్ మెంట్ గా ఫీల్ అవుతుంది. అంత ఎక్సయిట్ మెంట్ ఫీల్ కాకు వాళ్ళు నీ కడుపు రహస్యం బయటపెట్టాలని చూస్తున్నారు అని మీనాక్షి అంటుంది. అంతలో కావ్య వచ్చి తన కుటుంబాన్ని తీసుకెళ్తుంది. గుమ్మం బయట ఉన్నవాళ్ళకి ఇందిరాదేవి దిష్టి తీయమని చెప్పగానే‌.. "రుద్రాణి వెళ్లి నీ వియ్యపురాలు కుటుంబానికి దిష్టి తియ్యి.. ఆ రోజు నన్ను అన్నావ్ గా ఇప్పుడు నీ బాధ్యత మర్చిపోతే ఎలా" అని అపర్ణ అంటుంది. రుద్రాణి ఏం చెయ్యలేక వెళ్లి దిష్టి తీస్తుంది. కావ్య తన వాళ్ళని తీసుకొని తన గదిలోకి వస్తుంది. చీరలు చూపిస్తానని వాళ్ళ అమ్మ కనకం, పెద్దమ్మని తీసుకొని వెళ్తుంది కావ్య.

ఆ తర్వాత స్వప్న గదిలో రెడీ అవుతుంది. మైఖేల్ మత్తు ఇంజక్షన్ తీసుకొని వచ్చి ఎలాగైనా స్వప్నకి మత్తు వచ్చేలా చేసి లేపుకుని వెళ్లి పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. అప్పుడే మీనాక్షి అక్కడకు వచ్చి ఎవరు నువ్వు ఎందుకు వచ్చావని మైకేల్ ని అడుగుతుంది. జ్యూస్ తీసుకొచ్చానని కవర్ చేస్తాడు మైఖేల్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.