English | Telugu

మీది అగ్రిమెంట్ మ్యారేజ్ అని నాకు తెలుసు!

స్టార్ మా టీవీలో ప్రసారవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -179 లో.. కృష్ణ వాళ్ళ నాన్న తన ముందుకు వచ్చి నిల్చున్నట్లు ఊహించుకుంటుంది. దాంతో సంతోషంగా మురారిని ప్రేమిస్తున్న విషయం చెప్తుంది. నువ్వు మీ ఏసీపీ సర్ లో భర్త ప్రేమతో పాటు తండ్రి ప్రేమని కూడా చూసావ్ కాబట్టి నువ్వు మురారిని ప్రేమిస్తున్నావంటూ.. కృష్ణ వాళ్ళ నాన్న చెప్పి వెళ్ళిపోయినట్లు ఉహించుకుంటుంది.

మరొక వైపు ముకుంద, మురారి ఇద్దరు ఎక్కడికి వెళ్లారని ఆలోచిస్తూ.. ముకుంద వాళ్ళ నాన్న శ్రీనివాస్ కి కాల్ చేసి.. ముకుంద వచ్చిందా అని రేవతి అడుగుతుంది. రాలేదని శ్రీనివాస్ చెప్తాడు. ముకుంద గదిలోకి వెళ్లిన రేవతి అసలు ముకుంద ఎందుకు ఇలా చేస్తుంది.. అని టేబుల్ పై ఉన్న మురారి ఫోటోని చూస్తుంది. అసలు ముకుంద ది ప్రేమా లేక ఉన్మాదమా అని రేవతి అనుకుంటుంది. మరోవైపు కృష్ణ, మురారి ఫోటో చూస్తూ మీరు లేకుంటే నాకు ఏదోలా ఉంది ఏసీపీ సర్.. మీతో మాట్లాడాలని ఉందని అనుకుంటుంది. ఆ తర్వాత కృష్ణ ని చూసిన రేవతి ఈ రోజు హాస్పిటల్ కి ఎందుకు వెళ్ళలేదు అని అడుగుతుంది. మురారి లేడని కృష్ణ హాస్పిటల్ కి వెళ్ళలేదు కావచ్చు.. మురారి లేకపోతే కృష్ణ డల్ గా కనిపిస్తుంది.. మురారికి కృష్ణకి మధ్య అసలు ప్రేమ లేదని ముకుంద చెప్పింది అబద్దమా అని రేవతి అనుకుంటుంది. నువ్వు మురారికి ఫోన్ చెయ్, నేను ముకుందకి ఫోన్ చేస్తా అని రేవతి అంటుంది. ఇద్దరు ఫోన్లు కలవక పోవడంతో రేవతి కి టెన్షన్ పెరిగిపోతుంది.

ఆ తర్వాత కృష్ణ దగ్గరికి రేవతి వస్తుంది. అత్తయ్య ఏసీపీ సార్ ఫోన్ కలవట్లేదు నాకు టెన్షన్ గా వుంది అని కృష్ణ అనగానే.. రెండు మూడు నెలల్లో వెళ్లేదానివి నీకెందుకు టెన్షన్ అని రేవతి అనగానే.. కృష్ణ షాక్ అవుతుంది. మీది అగ్రిమెంట్ మ్యారేజ్ అని నాకు తెలుసని రేవతి అంటుంది. మీకెలా తెలుసని రేవతిని కృష్ణ అడుగుతుంది. నాకు ముకుంద చెప్పిందని రేవతి అనగానే.. ఏసీపీ సర్ కి, నాకు మధ్య జరిగిన అగ్రిమెంట్ తనకెలా తెలుసని కృష్ణ అడుగుతుంది. ముకుందకి మురారీనే చెప్పాడని రేవతి అనగానే..

అగ్రిమెంట్ గురించి చెప్తే మీకు లేదంటే పెద్ద అత్తయ్యకి చెప్పాలి తనకి చెప్పడమేంటని కృష్ణ అడుగుతుంది. అదంతా నాకు తెలియదు కానీ మీది అగ్రిమెంట్ మ్యారేజ్ కానీ పర్మినెంట్ మ్యారేజ్ గా నేను చేస్తానని రేవతి అనగానే కృష్ణ సంతోషపడుతుంది. నిన్ను ఒక కూతురిలాగా చూసుకున్న నాకెందుకు చెప్పలేదని కృష్ణని రేవతి అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.