English | Telugu

మెహబూబ్ ఎలిమినేషన్.. అప్పుడు కూడా దీపావళికే బయటకొచ్చా!


బిగ్ బాస్ సీజన్-8 లో ఎనిమిది వారాలు పూర్తయింది. ఇక ఎనిమిదో వారం మెహబూబ్ ఎలిమినేషన్ అయ్యాడు. వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన మెహబూబ్ హౌస్ లో ఫిజికల్ టాస్క్ లో చాలా యాక్టివ్ ఉన్నాడు. అయితే గత వారం జరిగిన బ్యాటరీ టాస్క్ లో తమ క్లాన్ మెంబర్స్ అయినటువంటి హరితేజ, నయని పావనిలని పట్టించుకోలేదనే కారణంతో వాళ్ళిద్దరు మెహబూబ్ ని నామినేట్ చేశారు. దానివల్లే నిన్నటి ఎపిసోడ్ లో మెహబూబ్ ఎలిమినేషన్ అయ్యాడు.

వీకెండ్ ఎపిసోడ్ ఫుల్ ఆఫ్ సెలబ్రిటీలతో నిండిపోయింది. సింగర్స్, డ్యాన్స్ పర్ఫామెన్స్, గేమ్స్, పాటలు డ్యాన్స్ ఇలా ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ తో నిండిపోయింది. అయితే నామినేషన్ లో ఆరుగురిలో నుండి ఒక్కొక్కరిని సేవ్ చేయగా నయని పావని, మెహబూబ్ చివరగా ఉన్నారు.‌ వీరిద్దరిలో మెహబూబ్ ఎలిమినేషన్ అయ్యింది. హౌస్ మేట్స్ అందరికి బై చెప్పేసి స్టేజ్ మీదకి వచ్చాడు మెహబూబ్. ఇక తన జర్నీ వీడియో చూసి ఎమోషనల్ అయ్యాడు. అప్పుడు కూడా దీపావళికే ఎలిమినేట్ అయ్యా.. ఇప్పుడు కూడా అలానే అయ్యా.. ప్రతీ టాస్కులో బెస్ట్ ఇద్దామని వచ్చా.. అన్ ఫార్చునేట్ నేను ఇక్కడ ఉన్నానంటూ మెహబూబ్ బాధపడ్డాడు. ఇక ఎప్పటిలాగే హౌస్ లో ఎవరెంటో చెప్పమని నాగార్జున అన్నాడు.

థౌంజెండ్ వాలా అవినాష్ కి ఇచ్చాడు. గంగవ్వకి లక్ష్మీ బాంబ్ ఇచ్చాడు. లైఫ్ లో నీకేం కావాలన్నా నేనున్నా బాధపడకు.. నీ చిన్న బిడ్డకి నేను చేస్తా అనడంతో గంగవ్వ ఎమోషనల్ అయ్యింది. తారాజువ్వని నబీల్ కి ఇచ్చాడు.‌కాకరవొత్తి రోహిణికి ఇచ్చాడు. అవినాష్, రోహిణి పక్కపక్కనే ఉంటే ఫుల్ నవ్వుకుంటాం. ఫైర్ నీలో ఉందని గౌతమ్ తో మెహబూబ్ చెప్పాడు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.