English | Telugu

మెహబూబ్ చేసిన సర్ ప్రైజ్ కి కంటతడి పెట్టుకున్న లాస్య మంజునాథ్!

మెహబూబ్.. ఒకవైపు డ్యాన్స్, మరొకవైపు జిమ్ లో వర్కవుట్ లు చేస్తూ సిక్స్ ప్యాక్స్ తో కనిపిస్తుంటాడు. బిబిజోడీలో శ్రీసత్యతో కలసి జోడికట్టి అదరహో అనిపించేలా డ్యాన్స్ చేశాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మెహబూబ్.. ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నాడు.

మెహబూబ్ హైదరాబాద్ లో పుట్టాడు. అనేక షార్ట్ ఫిల్మ్ లలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇతనొక యూట్యూబర్, నటుడు, డ్యాన్సర్. అందరు ఇతడిని మెహబూబ్ దిల్ సే అని పిలుచుకుంటారు. కరోనా లాక్ డౌన్ టైమ్ లో ఇతడు చేసిన టిక్ టాక్ లకి ఫుల్ క్రేజ్ వచ్చింది. దాంతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. అలాగే మెహబూబ్ ఒక యూట్యూబ్ ఛానెల్ ని కూడా స్టార్ట్ చేశాడు. అందులో అతని రీల్స్, వ్లాగ్స్ అన్నింటిని షేర్ చేయగా అన్నీ అత్యధిక వీక్షకాధరణ పొందుతున్నాయి. బిగ్ బాస్ సీజన్-4 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి తనదైన శైలితో గేమ్స్ ఆడి, టాస్క్ లు పూర్తిచేసి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ తర్వాత అతడికి పలు సినిమాల్లో అవకాశం వచ్చింది. జబర్దస్త్ లో కూడా అప్పుడప్పుడు మెరిసి తనలోని కామెడీని కూడా పరిచయం చేశాడు. ఇలా మల్టీ ట్యాలెంట్ గా ఉన్న మెహబూబ్ సెలబ్రిటీ రేంజ్ ని పొందాడు.

తాజాగా మెహబూబ్.. స్వీట్ సిస్టర్ గా భావించే లాస్య మంజునాథ్ పుట్టినరోజున తనకి తెలియకుండా వాళ్ళింటికి వెళ్లి సడన్ గా డోర్ తీసి హ్యాపీ బర్త్డే అంటూ సర్ ప్రైజ్ ఇచ్చాడు. అది చుసిన లాస్య ఫుల్ ఎమోషనల్ అవుతూ కంటతడి పెట్టుకుంది. ఇదంతా మెహబూబ్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసాడు. ఈ పోస్ట్ కి లాస్య మంజునాథ్ ని ట్యాగ్ చేసాడు. దీంతో మెహబూబ్ అభిమానులు, లాస్య అభిమానులు చూస్తూ కామెంట్లు చేస్తున్నారు. మీ ఇద్దరి బాండింగ్ బాగుంది. సొంత అక్క, తమ్ముడు కూడా ఇలా ఉండరంటూ అభిమానులు కామెంట్లు చేయగా, ఒక్కొక్కరికి లాస్య రిప్లై ఇస్తూ ఎమోషనల్ అవుతుంది. కాగా ఇప్పుడు ఈ వీడియో ఇన్ స్టాగ్రామ్ లో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.