English | Telugu
కీర్తిభట్ ని గీతు రాయల్ పిలవలేదంట!
Updated : Aug 28, 2023
కీర్తిభట్.. బిగ్ బాస్ సీజన్-6 తో అందరికి సుపరిచితమే. తాజాగా ఎంగేజ్ మెంట్ చేసుకొని మరింత క్రేజ్ సంపాదించుకుంది. అయితే బిగ్ బాస్ హౌస్ లో టాప్-5 లో ఒక్కరిగా ఉన్న కీర్తిభట్ తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని దక్కించుకుంది.
బిగ్ బాస్ సీజన్-6 లో ఎంట్రీ ఇచ్చిన కీర్తిభట్ మొదటి నుండి ఒక్కతే గేమ్స్ ఆడేది. ఎవరి సపోర్ట్ ఉండేది కాదు. మొదటగా ఆరోహీ, ఇనయాలతో క్లోజ్ గా ఉన్న కీర్తిభట్ ఆ తర్వాత చిన్న చిన్న గొడవలతో వారికి దూరంగా ఉంది. ఆ తర్వాత అందరూ తనని కార్నర్ చేసి గేమ్ ఆడుతున్నారని ఫీల్ అయ్యేది. అయితే ఒకసారి తన ఫ్యామిలీ గురించి చెప్పమన్నప్పుడు.. తనకు ఎవరూ లేరని, అందరూ యాక్సిడెంట్ లో చనిపోయారని చెప్పడంతో హౌస్ లో ఉన్నవాళ్ళంతా తనపై జాలి చూపించారు. ఆ తర్వాత శ్రీసత్య, శ్రీహాన్ లతో ఎప్పుడూ గొడవల్లో నిలుస్తూ స్క్రీన్ స్పేస్ ఎక్కువ తీసుకుంది. ఇక ఫ్యామిలీ వీక్ లో అందరికి సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళు వస్తుంటే.. కీర్తిభట్ కి మాత్రం ఎవరూ లేరని, ఎవరూ రారని బాధపడింది. దాంతో తన ఫ్రెండ్ మహేశ్ ని హౌస్ లోకి పంపించి తనకి హ్యాపీ నెస్ చేకూర్చారు బిగ్ బాస్ టీమ్. ఇక టాప్-5 లో ఒకరిగా నిలిచి అందరి అభిమానాన్ని దక్కించుకుంది కీర్తిభట్.
కీర్తిభట్ ఎంగేజ్ మెంట్ తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ అయింది. సొంతంగా ' మీ ఇంటి అమ్మాయి కీర్తి' అనే యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేసింది. అయితే తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ' ఆస్క్ మీ క్వశ్చనింగ్' స్టార్ట్ చేసింది. అందులో ఒక్కో అభిమాని అడిగే ప్రశ్నలను సమాధానలు చెప్పింది కీర్తి. 'చల్లని రాతిరి వెన్నెల్లో పరువాల పందిరిలో నిన్ను నన్ను ఏకం చేసే అనే పాట పాడింది ఆరోహీ'.. అది విని షాక్ అయిన కీర్తీ భట్ వామ్మో అని రిప్లై పెట్టింది. అయితే తాజాగా గీతు రాయల్ బర్త్ డే సందర్భంగా జరిగిన పార్టీకి శ్రీసత్య, వాసంతి హాజరయ్యారు. మీకు ఇన్విటేషన్ రాలేదా అని ఒకరు అడుగగా.. రాలేదని కీర్తిభట్ చెప్పింది. ఇంకా శ్రీహాన్, శ్రీసత్య వాళ్ళతో మాట్లాడట్లేదా అని ఒకరు అడుగగా.. లేదని , ఎవరి స్పేస్ వాళ్ళదని కీర్తిభట్ అంది. ఇలా కొన్ని కాంట్రవర్సీ క్వశ్చన్స్ కి రిప్లై ఇచ్చింది కీర్తిభట్. కాగా ఇప్పుడు ఇది ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ గా మారింది.