English | Telugu
రెండో మెగా చీఫ్ గా మెహబూబ్.. హరితేజకి బ్యాడ్ లక్!
Updated : Oct 12, 2024
బిగ్ బాస్ హౌస్ లో రెండు గ్రూప్ లకి మధ్య పోటాపోటీగా టాస్క్ లు జరుగుతున్నాయి. ఇక ఈ వారం హోటల్ టాస్క్ జరుగగా.. పాత కంటెస్టెంట్స్ హోటల్ స్టాఫ్.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన వాళ్లు అందరూ హోటల్ కి గెస్ట్స్. అయితే గెస్ట్స్ అందరు కూడ హోటల్ స్టాఫ్ దగ్గర సర్వీస్ తీసుకొని వాళ్లకి ఎంతో కొంత డబ్బులు ఇస్తూ వచ్చారు. టాస్క్ ముగిసే టైమ్ కి ఎవరి దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంటుందో.. వాళ్లే విన్ అన్నారు బిగ్ బాస్. అందులో వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన వాళ్లు విన్ అయ్యారు.
హౌస్ లోకి వచ్చిన ఏనిమిది మందిలో ఆరుగురు మాత్రమే బిగ్ బాస్ కంటెండర్స్ అవుతారు. వాళ్ళెవరో మీరే డిసైడ్ అయి చెప్పండి అని బిగ్ బాస్ చెప్పాడు. దాంతో పాటు పాత కంటెస్టెంట్స్ లో ఎక్కువ స్టార్ లు వచ్చిన వాళ్లు ఎవరు అని అడుగగా.. మణికంఠ, నబీల్ లకి వచ్చాయని నబీల్ చెప్తాడు. మీ ఇద్దరిలో ఒకరు మాత్రమే మెగా చీఫ్ కంటెండర్ అవుతారు. అది ఎవరో చెప్పమని అంటాడు. ఆ తర్వాత వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన ఏనిమిది మందిలో గంగవ్వ, టేస్టీ తేజ తప్ప మిగిలిన ఆరుగురు మెగా చీఫ్ కంటెండర్స్.. అయితే వాళ్లలో అందరు మణికంఠ అని చెప్పడంతో మణికంఠ కంటెండర్ అవుతారు. ఇక ఓ టాస్క్ ఇస్తాడు బిగ్ బాస్. అదేంటంటే ఏడుగురికి స్టిక్కర్స్ ఉన్న కోట్ వేసుకొని మిగతా ఇంటి సభ్యులందరు ఒకేసారి బాల్స్ విసురుతారు. ఎవరికి ఎక్కువ బాల్స్ అతుక్కొని ఉంటాయో వాళ్ళు అవుట్ అఫ్ ది రేస్.. దీనికి సంచాలకుడిగా టేస్ట్ తేజ ఉంటాడని బిగ్ బాస్ చెప్పాడు. ఇందులో మూడు లెవెల్ లు ఉంటాయి. మొదటగా గౌతమ్, నయని పావని, రోహిణి లు అవుట్ అఫ్ ది రేస్.. ఇక మిగతా నలుగురికి చేత్తో బ్యాలెన్సింగ్ చేయాలని బిగ్ బాస్ చెప్తాడు. అలా బజర్ మొదలవ్వగానే బిగ్ బాస్ చెప్పినప్పుడు ఒక్కొక్క వస్తువు ఒకదానిఫై ఒకటి పెడుతూ ఉంటారు.
ఈ టాస్క్ లో అవినాష్, మణికంఠ పక్కకి తప్పుకోగా చివరగా మెహబూబ్, హరితేజ ఉంటారు. అయితే బిగ్ బాస్ లాస్ట్ కి ప్లేట్ అని చెప్తాడు. హరితేజ ప్లేట్ పెట్టుకున్నాక కిందపడిపోతుంది. మెహబూబ్ ప్లేట్ పెట్టుకోడు కానీ హరితేజది పడ్డాక పడుతుంది. ఇక నబీల్ సంచాలకుడు. అతని నిర్ణయం తుది నిర్ణయం కాబట్టి మెహబూబ్ విన్నర్ అని చెప్తాడు. ఎందుకంటే హరితేజ రెండుసార్లు చేత్తో సరిచేసిందని తన నిర్ణయం బిగ్ బాస్ కి చెప్తాడు నబీల్. ఆ తర్వాత నబీల్ గోల్డ్ బ్యాండ్ ని మెహబూబ్ కి పెడతాడు. ఇలా ఈ టాస్క్ లో మెహబూబ్ గెలుస్తాడు హరితేజ జస్ట్ మిస్ అవుతుంది.