English | Telugu

ఇది నా అసలు పేరు కాదు..అప్పట్లోనే నేను ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నాను

మణిశర్మ గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. కానీ వైవీఎస్ శర్మ అంటే మాత్రం తెలీదు. మణిశర్మ అసలు పేరు ఇదే. "ఆలీతో సరదాగా షో"కి ఈ వారం మణిశర్మ ఎంట్రీ ఇచ్చారు. "మీ అసలు పేరు చాలా పెద్ద పేరంట కదా..ఇంతకు ఏమిటా పేరు" అని అడిగేసరికి - "అది నా ఒరిజినల్ నేమ్ కానీ అది ఇన్కమ్ టాక్స్ రికార్డ్స్ లో మాత్రమే ఉంటుంది. ఎనమండ్ర వెంకట సుబ్రహ్మణ్యం అనేది నా అసలు పేరు అని చెప్పారు మణిశర్మ. మణిశర్మగా నేనే మార్చుకున్నాను..నేను చేసిన అన్ని మూవీస్ లోకి మా నాన్నకు నచ్చిన పాట సమరసింహా రెడ్డి మూవీలోని "రావయ్యా ముద్దుల మావ" అది చాలా ఇష్టం. నేను పుట్టి పెరిగింది అంతా చెన్నెలోనే.

ఐదురుగు సంతానంలో నేనే చిన్నవాడిని. నాన్న వాళ్ళది పశ్చిమ గోదావరి జిల్లా పొడగట్లపల్లి. నాకు మొదటి అవకాశం తెలుగు సినిమాల్లోనే వచ్చింది. 200 కు పైగా సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేసాను. ఇక తమిళంలో 25 చిత్రాలు చేసాను. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో ‘రాత్రి’ ‘అంతం’ సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చేసాను. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎస్.డి.బర్మన్, ఆర్.డి.బర్మన్, అనుమాలిక్ తెలుగులో కోటి దగ్గర నేను వర్క్ చేసాను. అప్పట్లో కీబోర్డ్ ప్లేయర్‌గా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న మ్యూజిక్ డైరెక్టర్ నేనే. ఆ టైములో అందరూ రూ. 10 వేలు తీసుకునేవారు నేను మాత్రం రూ. లక్ష వరకు తీసుకునేవాడిని" అంటి మణిశర్మ ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పారు.

Podharillu: మహా పెళ్ళికి అంతా ఫిక్స్.. చక్రిని ఆమె అర్థం చేసుకుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -12 లో.....మహా తన డ్రీమ్ గురించి భూషణ్ కి చెప్తుంది. డ్రీం లేదు ఏం లేదు ఫ్యామిలీ ని చూసుకుంటే సరిపోతుంది. నాకు నచ్చింది వండి పెడుతూ వెళ్ళేటప్పుడు బై చెప్పి వచ్చేటప్పుటికీ అందంగా రెడీ అయి ఉంటే చాలని చెప్పగానే వీడితో అనవసరంగా నా డ్రీమ్ గురించి చెప్పానని మహా అనుకుంటుంది. అదంతా చక్రి వింటాడు. మరొకవైపు మాధవ దగ్గరికి గాయత్రి వచ్చి.. ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యిందంట కదా అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏ సైలెంట్ గా ఉండు.. ఈ విషయం కన్నాకి తెలియదని మాధవ అంటాడు.

Brahmamudi: రాజ్ తీసిన యాడ్ సక్సెస్.. ధాన్యలక్ష్మి ఇచ్చిన బిగ్ ట్విస్ట్ అదే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -911 లో..... అప్పు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒకావిడని రౌడీలు వెంబడిస్తారు. అప్పుని చూసి ఆవిడ దగ్గరికి వచ్చి.. మేడం కాపాడండి అంటుంది. రౌడీలు పోలీసులని చూసి పారిపోతారు. మేడమ్ వాళ్ళు నా నగలు దొంగతనం చెయ్యాలని వెంబడిస్తున్నారని చెప్తుంది. దాంతో వాళ్ళని పట్టుకోమని కానిస్టేబుల్ కి చెప్తుంది అప్పు. చాలా థాంక్స్ మేడమ్ అని ఆవిడ చెప్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను డ్రాప్ చేస్తానని అప్పు అంటుంది. ఆవిడ ఇంటిముందు దింపుతుంది...

Illu illalu pillalu : ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి బయటపడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో..... ప్రేమ, నర్మద కలిసి డుప్లికేట్ డాక్టర్ ని తీసుకొని వచ్చి శ్రీవల్లిని భయపెడతారు. నీకు జ్వరం తగ్గింది కదా అక్క ఇక ఇంటర్వ్యూకి వెళదామని ఇద్దరు దగ్గరుండి మరి ఇంటర్వ్యూ కోసం స్కూల్ కి తీసుకొని వెళ్తారు. శ్రీవల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇస్తుంది. టెల్ మీ యువర్ సెల్ఫ్ అని ప్రిన్సిపల్ అనగానే శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని ప్రిన్సిపల్ అడుగుతాడు.