English | Telugu
కొత్త సీరియల్ "ఔను..వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు"లో కనిపించనున్న బీబీ-6 వాసంతికృష్ణన్!
Updated : Dec 1, 2022
బిగ్ బాస్ సీజన్ 6 లో గ్లామర్ డాల్ గా అందరినీ అలరించిన వాసంతికృష్ణన్ స్టార్ మాలో ఒక సీరియల్ లో నటిస్తోంది. "ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు" అనే ఒక కొత్త సీరియల్ లో ఈమె మెయిన్ రోల్ లో కనిపించబోతోంది.
ఇక ఈ సీరియల్ లో సిద్దార్ధ్ వర్మ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. ఇక ఈ సీరియల్ కి సంబంధించిన ప్రోమో ఒకదాన్ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సీరియల్ లో వాసంతి రాయలసీమ యాసలో భలే గమ్మత్తుగా మాట్లాడింది. ఈ స్టోరీ విషయానికి వస్తే - "మనోజ్, ఢిల్లీ అని ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఇందులో మనోజ్ రాముడు మంచి బాలుడు టైపు. కానీ ఒళ్ళంతా కూడా ఓసీడి..ఇక ఢిల్లీ అనే వాడికి ఒళ్ళంతా పొగరు. వీడు మహా కంత్రి టైపు. ఇద్దరూ ఒకే కడుపున పుట్టినా కూడా మనోజ్ బెంగళూరులో ఢిల్లీ కాళహస్తిలో పెరుగుతూ ఉంటారు.
తిమ్మిని బమ్మిని చేసే ఢిల్లీ గాడు కళావతి మెడలో తాళి కడితే మనోజ్ మాత్రం పూజని పెళ్లి చేసుకుంటాడు. ఈ క్లాసు..మాస్ భార్యభర్తల యవ్వారం ఎట్టా ఉండబోతోందో ? త్వరలో మీ స్టార్ మా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో చూడండి అని ఈ స్టోరీ మెయిన్ లైన్ గురించి వాయిస్ ఓవర్ ఇచ్చింది బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ గీతూ రాయల్. ఐతే ఈ సీరియల్ ఏ టైం స్లాట్ లో ప్రసారమవుతుందో మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సు గా ఉంచారు.