English | Telugu

ఆమ్లెట్ తిన్నాక తానెవరో మర్చిపోయిన స్నేహ

"మిస్టర్ అండ్ మిస్సెస్" కపుల్ రియాలిటీ షో ప్రతీ వారం మస్త్ ఎంటర్టైన్మెంట్ అందిస్తూ వస్తోంది. ఇక రాబోయే వారం "కుకింగ్ థీమ్" పేరుతో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఎగ్స్ తో రకరకాల ఆమ్లెట్స్ వేశారు కపుల్స్..హస్బెండ్స్ అందరూ ఈ ఆమ్లెట్ మిక్సింగ్ ని పెనం మీద పోస్తున్నారు కానీ ఒక్కరికి కూడా రౌండ్ గా రాకపోయేసరికి శ్రీముఖి కౌంటర్ వేసింది. "ఆనియన్ ఆమ్లెట్ వేయమన్నా అండా బుర్జీ కాదు" అని అనేసరికి అందరూ నవ్వేశారు.

ఇక శ్రీవాణి వాళ్ళు వేసిన ఆమ్లెట్ పీస్ తిన్న శివబాలాజీ, స్నేహ కళ్ళు తిరిగి కింద పడిపోయారు. ఆమ్లెట్ తినేసరికి స్నేహ వాయిస్ చేంజ్ ఐపోయింది. దాంతో శివబాలాజి "మీ పేరేమిటి అనడంతో శ్రీముఖి" అని ఆన్సర్ చేసింది. "మీ ఆయన పేరేమిటి అని శ్రీముఖి స్నేహాను అడిగేసరికి బాలాజీ" అని చెప్పింది. దాంతో శ్రీముఖి శ్రీవాణి భర్త విక్రమ్ కి వార్నింగ్ ఇచ్చింది. "తాగేసిన కోతిలా కాదు ఆమ్లెట్ వేయాల్సింది" అని ...ఇక ఈ రాబోయే వారం అందరితో పూరీలు పొంగించింది, సెట్ దోశలు వేయించింది శ్రీముఖి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.