English | Telugu
జగతికి దండం పెట్టిన రిషీ
Updated : Jun 2, 2022
గుప్పెడంత మనసు ఈ రోజు ఎపిసోడ్ లో రిషి క్లాస్ చెబుతూ వుండగా అక్కడికి వసుధార వస్తుంది. లోపలికి రావచ్చా సర్ అని పర్మీషన్ అడుగుతుంది. వసుపై కోపంతో బోర్డ్ పై చాక్ సీస్ని నలిపేసిన రిషీ స్టూడెంట్స్ కి ఒక లెక్క ఇచ్చి దాన్ని సాల్వ్ చేయబని చెబుతాడు. తనపై రిషీకి ఇంకా కోపం పోలేదని గ్రహించిన వసుధార అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అదే సమయంలో రిషి బాధపడుతూ వెళ్లి వసు కూర్చునే ప్లేస్ లో కూర్చుని తనతో మాట్లాడినట్టుగా భ్రమపడతాడు. కట్ చేస్తే జగతి జరిగిన విషయం గురించి మహేంద్రకు వివరించడంతో తను షాక్ కు గురవుతాడు.
వెంటనే మహేంద్ర వసు, రిషీ ఇన్నాళ్లు దగ్గరగా వుండటానికి కారణం గురుదక్షిణ అంటూ నోరు జారతాడు. ఆ మాటలు విన్న జగతి ఏంటీ ఏదో అన్నావ్ అంటూ మహేంద్రని నిలదీస్తుంది. రిషీని నా కోరిక ప్రకారం నీకు గురుదక్షిణగా ఇవ్వమని వసుకి చెప్పానని చెప్పడంతో జగతి షాక్ అవుతుంది. వీరిద్దరు మాట్లాడుకుంటుండగా గౌతమ్ ఆ మాటలు విని ఆశ్చర్యపోతాడు. కట్ చేస్తే ... జరిగిన విషయం తెలిసి సాక్షి ఆనందిస్తూ వుంటుంది. వసు - రిషీల మధ్య ఏర్పడిన దూరాన్ని గుర్తు చేసుకుంటూ సంతోషిస్తుంటుంది. ఓ పక్క రిషి క్లాస్ రూమ్ లో కూర్చుని వసు జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ బాధపడుతుంటాడు.
కట్ చేస్తే.. రిషిని ఎందుకు రిజెక్ట్ చేశావని వసుని గౌతమ్ నిలదీస్తాడు. కారణం ఏంటని ప్రశ్నిస్తాడు. నీ బొమ్మ గీసింది, నీకు లవ్ లెటర్ రాసింది కూడా రిషీ నే అని గౌతమ్ చెప్పడంతో వసు ఒక్కసారిగా షాక్ కు గురవుతుంది. అది గమనించిన గౌతమ్ నువ్వు రిషీని ప్రేమిస్తున్నావు అని గట్టిగా అంటాడు. వెంటనే అవును సార్ నేను ప్రేమిస్తున్నానని వసు చెబుతుంది. ఆ మాటలు రిషీ వింటాడు. ఆ తరువాత ఏం జరిగింది? .. జగతికి రిషీ ఎందుకు దండం పెట్టాడు? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.