English | Telugu

రిషీని ప్రేమిస్తున్నానని చెప్పిన వసుధార !

వసుధారను క్లాస్ లోకి రమ్మని చెప్పకపోయేసరికి క్లాస్ మొత్తం గుసగుసలాడుకుంటుంది. వెంటనే కోపంతో రుషి సైలెన్స్ అని అరుస్తాడు. కాలేజీకి టైంకి రావాలి. దాన్నే మేనర్స్ అంటారని గట్టిగా చెప్తాడు. ఇంతలో క్లాస్ ఐపోతుంది. వసుధార బాధతో వెళ్ళిపోతుంది. రిషి మనసులో వసు జ్ఞాపకాలు వెంటాడుతుంటాయి. ఇంట్లో జగతి రిషి ప్రేమను వసుధార రిజెక్ట్ చేసిందని మహేంద్రకి చెప్తుంది. ఆ మాటలకు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఈ విషయం చాటుగా విన్న గౌతమ్ కూడా ఆశ్చర్యపోతాడు. వెంటనే కాలేజీకి వెళ్తాడు. అక్కడ రిషి సర్ తనను ఎందుకు క్లాస్ లోకి రాన్నివ్వలేదో తేల్చుకుందామని క్లాస్ కి వెళ్లబోతుంది వసుధార. ఇంతలో గౌతమ్ వసుని పిలిచి మాట్లాడదామని పిలుస్తాడు. గౌతమ్ అడిగిన అన్ని ప్రశ్నలకు నో చెప్తుంది చెప్తుంది వసు.

అప్పుడు గౌతమ్ సీరియస్ గా వసుధార బొమ్మ గీసింది, ప్రేమలేఖ రాసింది రుషి అనే నిజాల్ని చెప్పేస్తాడు. వసు ఒకింత ఆశ్చర్యపడినా మళ్ళీ మాములుగా " అవును సర్ నేను ప్రేమిస్తున్నాను" అంటూ గట్టిగా చెప్తుంది. ఈ విషయాలన్నీ రుషి చాటుగా వింటాడు. వసు అన్న ఆ మాటతో రుషి హ్యాపీనెస్ ఫేస్ లో తెలుస్తుంది. కానీ అంతలో మళ్ళీ మాట మార్చి "నా లక్ష్యాన్ని ప్రేమిస్తున్నా, నా గోల్ ని ప్రేమిస్తున్నా" అని చెప్పేసరికి రిషి ముఖం మారిపోతుంది. ఇంతలో రిషి సెల్ రింగ్ అయ్యేసరికి గౌతమ్ , వసు అటువైపు చూస్తారు.

రిషీ వాళ్ళను చూసి వెళ్ళిపోతాడు. మరో పక్కన సాక్షి మనసులో దేవయాని గురుంచి చెడుగా ఆలోచిస్తూ ఉంటుంది. " రుషిని పెళ్లి చేసుకుని ఇంట్లో ఈమెకు సేవలు చేయడానికి నన్ను తోలుబొమ్మను చేసి ఆడిద్దామనుకుంటోంది. కానీ నా గోల్స్ వేరు..వాటిని తాత్కాలికంగా పక్కన పెట్టాను. మెయిన్ గోల్ తన ప్రేమను కాదన్న రిషిని పెళ్లి చేసుకోవడమే అనుకుంటూ ఒక విలనీ నవ్వు నవ్వుతుంది. ఇవి ఈరోజు సాయంత్రం ప్రసారమయ్యే గుప్పెడంత మనసు సీరియల్ అప్ డేట్స్.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.