English | Telugu
హ్యాపీ బర్త్ డే హేమచంద్ర
Updated : Jun 2, 2022
టాలీవుడ్ కి దొరికిన ఒక ఆణిముత్యం హేమచంద్ర. అతను తన గానంతో, గాత్రంతో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాడు. మా టీవీలో ప్రసారమైన సూపర్ సింగర్స్ అనే సింగింగ్ షో ద్వారా పరిచయమయ్యారు. ప్రస్తుతం టాలీవుడ్ సింగర్స్ లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న హేమచంద్ర ఫస్ట్ పాడిన సాంగ్ మణిశర్మ సంగీతాన్నందించిన లక్ష్యం మూవీలో " నిలువవే.." అనే పాట. ఈ సాంగ్ సూపర్ పాపులర్ అయ్యింది. తర్వాత బిల్లాలో " బొమ్మాళి.." పరుగులో " హృదయం.." ఇటీవల ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఫ్రెండ్ షిప్ సాంగ్ పాడి సంచలనం సృష్టించారు. హేమచంద్ర పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆయన వైఫ్ పేరు శ్రావణ భార్గవి. ఆమె కూడా టాప్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు. వీరిద్దరిదీ ప్రేమ వివాహం. ఇక ఈరోజు హేమచంద్ర బర్త్ డే. మరి ఆయనకు విషెస్ చెప్పేద్దాం.