English | Telugu
దీప్తి బ్రేకప్ పోస్టుకు షణ్ణు రిప్లై ఇదే!
Updated : Jan 1, 2022
షణ్ముఖ్ జస్వంత్, తాను ఎవరి దారి వారు చూసుకుంటున్నామని చెప్తూ నూత్న సంవత్సరారంభం సందర్భంగా దీప్తి సునైన పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ సంచలనం సృష్టించింది. బిగ్ బాస్ 5 హౌస్‌లో షణ్ణు ప్రవర్తనే దీనికి కారణమై ఉండొచ్చంటూ రకరకాలుగా సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. కాగా దీప్తి పెట్టిన పోస్ట్‌కు షణ్ణు స్పందించాడు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెట్టిన పోస్టులో నిర్ణయం తీసుకునే హక్కు దీప్తికి ఉందని చెప్పాడు. ఆమె చాలా కష్టాలు పడిందనీ, ఆమె సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపాడు.
Also read:దీప్తితో బ్రేకప్.. క్లారిటీ ఇచ్చిన షణ్ముఖ్!
"నిర్ణయం తీసుకునే అన్ని హక్కులు ఆమెకు ఉన్నాయి! ఇప్పటి వరకు ఆమె చాలా కష్టాలు పడింది. చివరకు ఆమె సంతోషంగా, ప్రశాంతంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మేం ఏ దారిలో వెళ్లినా ఒకరికొకరు ఆసరాగా ఉంటాం. నేను మెరుగైన వ్యక్తిగా ఎదగడానికి నీ అందమైన 5 సంవత్సరాలు సహాయం చేసినందుకు థాంక్యూ. నువ్వు సంతోషంగా ఉండటానికి అర్హురాలివి. టేక్ కేర్ అండ్ ఆల్ ది బెస్ట్ దీపూ" అంటూ రాసుకొచ్చాడు షణ్ణు.
ఇన్నేళ్లు దీప్తితో ప్రేమలో ఉన్న షణ్ణు బిగ్ బాస్ హౌస్‌లో తోటి కంటెస్టెంట్ సిరి హన్మంత్‌తో అలా ఎలా సన్నిహితంగా మెలిగాడు, కౌగిలింతలు, ముద్దుల్లో ఎలా మునిగి తేలాడు అంటూ అతడిపై నెటిజన్లు విరుచుకు పడుతున్నారు. సిరితో షణ్ణు అంత క్లోజ్‌గా మూవ్ అవుతున్నప్పటికీ, దీప్తి చివరిదాకా అతడికి సపోర్ట్‌గా నిలిచిందనీ, అదంతా గేమ్‌లో భాగంగానే చేస్తున్నాడని ఆమె నమ్మిందనీ వారు అభిప్రాయపడుతున్నారు. అయితే దీప్తి నమ్మకాన్ని షణ్ణు నిలబెట్టుకోలేదని వారు విమర్శిస్తున్నారు.
Also read:సిరి, షన్ను రిలేషన్ పై సన్నీ కామెంట్
అంతకు ముందు కొత్త సంవత్సరం ప్రారంభంలో దీప్తి సునైన తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పెట్టిన పోస్టులో, "నా శ్రేయోభిలాషులు, స్నేహితులందరికీ, చాలా లోతుగా ఆలోచించిన మీదట, షణ్ముఖ్, నేను పరస్పరం మా వ్యక్తిగత జీవితంలో ముందుకు సాగాలని, ఎవరి సొంత వ్యక్తిగత మార్గాలను అనుసరించాలని నిర్ణయించుకున్నాం. గత 5 సంవత్సరాలు మా ఇద్దరికీ ఆనందాన్నీ, ఆప్యాయతనీ, ఎదుగుదలనీ అందించడమే కాదు, మా భూతాలతో వ్యవహరించడం చాలా కష్టమైంది.
మీరందరూ కోరుకున్నట్లే ఇది కొనసాగాలని మేమిద్దరం కోరుకున్నాం. కానీ ఇదిప్పుడు చాలా కాలంగా జరుగుతోంది. అతే కాదు, ఇది సోషల్ మీడియాలో కనిపించినంత తేలికైన స్వారీ కాదు. మేం కలిసి ఉండటానికి పోరాడుతూనే, జీవితంలో మాకు నిజంగా ఏం అవసరమనే దాన్ని విస్మరిస్తూ వచ్చాం. మా దారులు భిన్నమైనవని, వాటిలో చిక్కుకోకుండా ముందుకు సాగాలని గ్రహించే స్థాయికి మేం చేరుకున్నాం.
మీ అందరి ప్రేమకు నేను బద్ధురాలిని. ఈ క్లిష్ట సమయాల్లో మాకు అండగా ఉండాల్సిందిగా, కొత్త దిగంతాల వైపు మేం వెళ్తున్నప్పుడు మాకు అవసరమైన ఏకాంతాన్ని కల్పించమనీ, మద్దతును అందించమనీ మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను.
ధన్యవాదాలు - దీప్తి సునైనా" అని రాసుకొచ్చింది.