English | Telugu

సుప్రీం కోర్ట్‌పై బ్రహ్మముడి రాజ్ భార్య సెటైర్లు!

దీపికా రంగరాజు బ్రహ్మముడి సీరియల్ లో మానస్ కి జోడీగా నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. దీపికా ఎక్కడ ఉంటే అక్కడ అల్లరి అల్లరి. ఏ షోకి వెళ్లినా అల్లరి చేస్తూ కనిపిస్తుంది. తమిళనాడులోని చెన్నైలో పెరిగిన ఈ బ్యూటీ మోడల్, నటిగా గుర్తింపు తెచ్చుకుంది. కొన్ని తమిళ్ మూవీస్ లో కూడా నటించింది. ఆ తరువాత సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మూవీ ఇండస్ట్రీకి రాక ముందు ఆమె తమిళ న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రారంభించింది. అలాంటి దీపికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఒక ఇంటరెస్టింగ్ పోస్ట్ పెట్టింది.

సుప్రీం కోర్ట్ సెలవుల మీదే కన్నేసింది. ఏడాదిలో సుప్రీమ్ కోర్ట్ కేవలం 193 రోజులు మాత్రమే పని చేస్తుంది అనేది దాని సారాంశం. 45 రోజులు సమ్మర్ హాలిడేస్, 15 రోజులు వింటర్ హాలిడేస్, 7 రోజులు హోలీ బ్రేక్, 5 రోజులు దసరా హాలిడేస్, 5 రోజులు దివాలీ హాలిడేస్. ఇన్ని సెలవలు ఉంటాయన్న విషయం ఇంజనీరింగ్ కాలేజీలో చేరక ముందు తెలిసిఉంటే ఇంజనీరింగ్ చదవకుండా న్యాయ శాస్త్ర విద్యనే చదివేదాన్ని కదా అంటూ ఫన్నీ ఎమోజి పెట్టి తన అభిప్రాయాన్ని కామెడీగా షేర్ చేసుకుంది.

"బ్రహ్మముడి’ సీరియల్ లో బుల్లి తెరపై ఎంట్రీ ఇచ్చిన దీపిక రంగరాజు తన నటనతో ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. హీరో రాజ్‌తో ఎప్పుడూ గొడవపడుతూ ఉంటుంది. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. ‘బ్రహ్మముడి’ సీరియల్ బెంగాలీ సీరియల్ ‘గట్చోరా’కి రీమేక్. ఈ సీరియల్ లో మానస్, దీపిక రంగరాజు, హమీదా, కిరణ్ కాంత్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.