English | Telugu
లాస్యకు ఫంక్షన్ లో ఘోర అవమానం...
Updated : Jun 2, 2022
బర్త్డే పార్టీకి అంకిత తులసి తెచ్చిన శారీ కట్టుకుని వచ్చేసరికి అక్కడ అందరూ షాక్ ఐపోతారు. ఆ శారీని ఎలాగైనా మార్పించి లాస్య తెచ్చిన చీర కట్టిద్దామని గాయత్రి అనుకుని ఒక ప్లాన్ వేస్తుంది. జ్యూస్ గ్లాస్ తీసుకెళ్లి అంకితతో ఫోర్స్ గా తాగిద్దామనుకునేసరికి జ్యూస్ శారీ మీద ఒలికిపోతుంది. దాంతో శారీ పాడైపోయింది కదా వెళ్లి లాస్య తెచ్చిన చీర కట్టుకో అంటుంది. కానీ అంకిత ఒప్పుకోదు. తులసి అప్పుడు చెప్తుంది ఆ చీర మీద మరక పడినా పైకి కనిపించదు అంటూ ఆ చీర స్పెషాలిటీ గురుంచి చెప్పుకొస్తుంది.
తర్వాత అంకిత కేక్ కట్ చేసి తులసికి తినిపిస్తుంది. దాంతో లాస్య చాలా ఫీల్ అవుతుంది. తులసికి అంత ప్రిఫెరెన్స్ ఇచ్చేసరికి గాయత్రి, నందు, లాస్య, అందరూ కూడా షాక్ ఐపోతారు. గాయత్రీ ఈ విషయంగా అంకితను గట్టిగా నిలదీస్తుంది. అసలు పార్టీ నేను చేయమని అడగలేదు కదా అంటూ కౌంటర్ ఇస్తుంది. తర్వాత లాస్యకు కేక్ పీస్ ఇస్తుంది అంకిత. కానీ లాస్య విసురుగా లాక్కుంటుంది అసహ్యంగా ముఖం పెడుతుంది.
ఆ తర్వాత తులసిని ఒక పాట పాడమని అడుగుతుంది అంకిత. "గాలి చిరుగాలి" అంటూ మంచి సాంగ్ పాడుతుంది. మరో పక్క లాస్య నందు మేడ మీదకు వెళ్లి తీరిగ్గా బాధపడుతూ ఉంటారు. అభి వచ్చి అంకిత తరపున సారీ చెప్తాడు. లాస్య నటించడం స్టార్ట్ చేస్తుంది. ఇంతలో అక్కడికి గాయత్రి వచ్చి తన కూతురు మొండిదని తెలుసు కానీ ఇంత జగమొండి అని తెలీదని లాస్యతో అంటుంది. అభి ఇదంతా మీ అమ్మ వల్లే వచ్చింది ...దొంగచాటుగా అంకితతో ఫంక్షన్ కి పిలిపించుకుని ఇంత రాద్ధాంతం చేసింది అంటూ తులసిని నిష్ఠూరాలు ఆడుతుంది. ఆ విషయాలన్నీ అటుగా వెళ్తున్న తులసి వినేస్తుంది. వెంటనే బాధపడుతూ అంకిత దగ్గరకు వచ్చి ఇక ఎప్పటికి తన ఇంటి గుమ్మం తొక్కనని ప్రమాణం చేయమని అడుగుతుంది. అంకిత షాక్ అయ్యి ఏడవడం స్టార్ట్ చేస్తుంది. ఈ హైలెట్స్ అన్ని ఈరోజు సాయంత్రం ప్రసారం అయ్యే ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో చూడొచ్చు.