English | Telugu
శ్రీరామ్-శివబాలాజీ-ఎస్తర్.. జీ5లో సరికొత్త వెబ్ సిరీస్ 'రెక్కీ'
Updated : Jun 1, 2022
దేశంలోని టాప్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన జీ5 నుంచి మరో వెబ్ సిరీస్ రాబోతోంది. శ్రీరామ్, ఎస్తర్ నోరోన్హ, శివబాలాజీ, ధన్య బాలకృష్ణన్ ప్రధాన పాత్రధారులైన ఆ సిరీస్.. రెక్కీ. జూన్ 17 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నది. రాధిక, సాయికుమార్ ప్రధాన పాత్రలు పోషించగా, ఇటీవల స్ట్రీమింగ్ అయిన గాలివానకు మంచి ఆదరణ లభించడంతో, ఇనుమడించిన ఉత్సాహంతో రెక్కీని అందిస్తోంది జీ5.
రెక్కీ స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటించిన సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. 1990ల నాటి కథతో, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో థ్రిల్లర్‌గా రెక్కీ రూపొందినట్లు దర్శకుడు పోలూరు కృష్ణ తెలిపారు. ఒక్కొక్కటి 25 నిమిషాల నిడివి ఉంటే 7 ఎపిసోడ్లుగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నది.
దర్శకుడు పోలూరు కృష్ణ మాట్లాడుతూ, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ హత్య చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇందులో ఎన్నో ఉత్కంఠభరితమైన సంఘటనలతో వీక్షకులను ఎంటర్‌టైన్ చేస్తుంది. కొత్తగా నియమించబడిన లెనిన్ అనే సబ్ ఇన్‌స్పెక్టర్, 'రెక్కీ'లో ఎక్స్‌పర్ట్ అయిన పరదేశి మధ్య ఈ కథ నడుస్తుంది. 1992లో తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ వరదరాజులు హత్యకు ఎలా ప్లాన్ చేశారు? ఇన్స్పెక్టర్ లెనిన్ ఈ కేసును ఎలా ఇన్వెస్టిగేషన్ చేసి ఛేదించాడు.. అనేది ప్రధానాంశం. అని చెప్పారు.
ఉత్కంఠభరితమైన డ్రామా, ఉత్తేజకరమైన మలుపులతో రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సిరీస్ కుర్చీలపై మునివేళ్లపై కూర్చోబెడుతుందని యూనిట్ చెబుతోంది. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ హత్య విషయంలో హంతకులు రాజకీయంగా ప్రేరేపించబడ్డారా, లేక అది పాతకక్షల నేపథ్యంలో జరిగిందా, ఇంకేదైనా చీకటి కోణం ఉందా? అనే విషయాలు ఉత్కంఠను కలిగిస్తాయి. లెనిన్ పరిశోధనలో బయటపడే రహస్యాలు షాక్‌ను కలిగిస్తాయి. శ్రీరామ్, శివబాలాజీ ఇంతవరకూ చేయని పాత్రలు ఇందులో చేశారు. సీరీస్‌లోని ప్రధాన భాగాలను అనంతపురంలో చిత్రీకరించారు.
పాత్రలు - పాత్రధారులు
లెనిన్ - శ్రీరామ్
చలపతి - శివబాలాజీ
గౌరి - ధన్య బాలకృష్ణ
రేఖ - ఎస్తర్ నోరోన్హ
వరదరాజులు - ఆడుకాలమ్ నరేన్
ఎమ్మెల్యే - జీవా
బుజ్జమ్మ - శరణ్య ప్రదీప్
దేవకమ్మ - రాజశ్రీ నాయర్
రంగనాయకులు - రామరాజు
కుళ్లాయప్ప - తోటపల్లి మధు
పోలీసాఫీసర్ - సమీర్
పరదేశి - సమ్మెట గాంధీ