English | Telugu

శ్యామా పై ఐశ్వర్య నిఘా

వసంతకు చెప్పి శ్యామా జాబ్ విషయం సెటిల్ చేస్తాడు అఖిల్. జాబ్ రిజైన్ చేయాల్సిన అవసరం లేదని వసంత శ్యామాకు చెప్తుంది. ఈ విషయం విన్న ఐశ్వర్య ఇంకో ప్లాన్ వేస్తుంది. వెంటనే బ్లూ ఎఫ్ ఎం స్టేషన్ కి ఫోన్ చేసి సౌజన్యతో మాట్లాడుతుంది. ఎలాగైనా కృష్ణతులసిని జాబ్ లోంచి తీసేయమని చెప్తుంది. సౌజన్య కూడా ఇది కరెక్ట్ టైం అని ఫేక్ రేటింగ్స్ క్రియేట్ చేస్తుంది. ఆ షీట్ ని రామారావుకి చూపిస్తుంది. అతను షాక్ ఐపోతాడు. ఎందుకు రేటింగ్స్ పడిపోయాయని సౌజన్యను అడుగుతాడు. అదంతా ఫేక్ తప్ప ఒరిజినల్ రేటింగ్స్ కాదని ఇది స్టేషన్ హెడ్ కి చూపించి కృష్ణతులసిని జాబ్ నుంచి తీసేసే ప్లాన్ అని చెప్తుంది.

మరో పక్క అఖిల్ కి జాబ్ విషయమై థాంక్స్ చెప్తుంది శ్యామా. అంతా బానే ఉంది. నువ్వు నా గదిలోనే పడుకో అంటాడు. కాదు నా రూమ్ లో పడుకుంటా అంటుంది శ్యామా. ఎన్ని రోజులు ఇలా ఇద్దరం వేరే వేరే గదుల్లో ఉండాలి అంటూ సరసం ఆడతాడు అఖిల్. పెద్దవాళ్ళు ముహూర్తం పెట్టేవరకు అంటుంది శ్యామా. ఈ విషయాలన్నీ అటుగా వెళ్తున్న వైదేహి విని వెళ్లి వసంతకు చెప్తుంది. ఇద్దరికీ మూహూర్తం త్వరలో పెట్టించి ఒకటి చేద్దాం అనుకుని నిర్ణయం తీసుకుంటారు.

మరో వైపు శ్యామా మసాలా కంపెనీకి వెళ్లి సెపరేట్ గా స్టాక్ తీసి పక్కన పెట్టావా లేదా అంటూ వర్కర్ ని అడుగుతుంది. చెప్పినట్టే చేశానని చెప్తుంది ఆ వర్కర్. ఈ విషయం ఐశ్వర్యకు కానీ ఇంకా ఎవరికీ తెలియకూడదు.. తెలిస్తే ప్లాన్ వర్కౌట్ అవదు అంటుంది. సరే అని అభయమిస్తుంది వర్కర్. ఆ వెంటనే ఐశ్వర్య మసాలా కంపెనీకి వస్తుంది. స్టాక్ విషయంలో అనుమానం వచ్చి సెపరేట్ ఉన్న స్టాక్ గురించి ఆరా తీస్తుంది. తనకు ఎలాంటి విషయం తెలీదని శ్యామా మేడం పక్కన పెట్టించారని చెప్తుంది వర్కర్. ఈ రోజు మధ్యాహ్నం ప్రసారమయ్యే ఈ ఎపిసోడ్ హైలైట్స్ ఇవి.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.