English | Telugu

భార్య జ్ఞాపకాలలో మునిగిపోయిన భర్త.. గతం గుర్తుకు రానుందా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -330 లో.. కృష్ణని శ్రీనివాస్ ఇంట్లో చూసిన భవాని.. కృష్ణకి వార్నింగ్ ఇస్తుంది. ఇక ఎలాగు అందరికి కృష్ణ వచ్చిన విషయం తెలుసు కాబట్టి అందరి ముందే కృష్ణ వచ్చినట్లు మాకు చెప్పలేదని శ్రీనివాస్ ని అడుగుతుంది భవాని. అయిన కృష్ణ వచ్చినట్లు శ్రీనివాస్ అంకుల్ ఎందుకు చెప్పలేదు? కిచెన్ లో కృష్ణ ఉంటే ఎందుకు మమల్ని అటు వైపు వెళ్ళనివ్వలేదు? ఎలాగైనా తెలుసుకోవాలని మురారి అనుకుంటాడు.

మరొకవైపు భవాని తీసుకున్న నిర్ణయం గురించి రేవతి బాధపడుతుంటుంది. అప్పుడే శకుంతల వస్తుంది. అసలు ప్రభాకర్ అన్నయ్య ఎందుకు జైలు కి వెళ్ళాడని రేవతి అడుగుతుంది. అసలేం చెప్పలేదు. నేను ఇలా చేస్తేనే కృష్ణ, అల్లుడు హ్యాపీగా ఉంటారని చెప్పాడు. అంతకు మించి ఏం చెప్పలేదని శకుంతల చెప్తుంది. ఆ తర్వాత ఒక అతను రేవతి దగ్గరకి వచ్చి.. భవాని గారు కార్డ్స్ మోడల్స్ తీసుకొని రమ్మని చెప్పారని అనగానే రేవతి షాక్ అవుతుంది. అప్పుడే మధు వచ్చి.. పెద్దమ్మ వచ్చేవరకు వెయిట్ చెయ్యమని చెప్తాడు. మరొకవైపు భవాని, ముకుంద మురారి అందరు శ్రీనివాస్ ఇంటి నుండి బయలుదేర్తారు. ఆ తర్వాత శ్రీనివాస్ ని కృష్ణ ఒక హెల్ప్ చెయ్యమని చెప్తుంది. దానికి శ్రీనివాస్ సరే అంటాడు. మరొకవైపు రేవతి ఏడుస్తు ఉంటుంది. ఎందుకు ఏడుస్తున్నావని నందు వచ్చి అడుగుతుంది. కార్డ్స్ మోడల్స్ కోసం ఒక అతను వచ్చాడు. కృష్ణ గురించి ఆలోచిస్తున్నానని రేవతి అనగానే.. కృష్ణ గురించి ఏం టెన్షన్ పడకు. అంత తనే చూసుకుంటుందని నందు చెప్తుంది.

మరొకవైపు ముకుంద, మురారి, భవాని కలిసి రెస్టారెంట్ కి వెళ్తారు. అక్కడ ఒక భర్తకి భార్య వడ్డీస్తుంటే.. మురారికీ గతంలో ఎవరో వడ్డీంచినట్లు గుర్తుకు వచ్చి.. వాళ్ళ దగ్గరకు వెళ్లి మీరు నాకు ఎప్పుడైనా వడ్డించారా అని అడుగుతాడు. దాంతో మురారి ఏం చేస్తున్నవంటూ భవాని టెన్షన్ పడుతుంది. అప్పుడే కృష్ణ కూడా అదే రెస్టారెంట్ కి వస్తుంది. వాళ్ళతో ఆర్గుమెంట్ చేస్తున్న మురారిని కృష్ణ సముదాయిస్తుంది. ఆ తర్వాత అందరు కలిసి ఇంటికి వెళ్తారు. మురారి కోపంగా పైకి వెళ్ళిపోతాడు. తరువాయి భాగంలో.. నేను గతంలో ఏం చేసేవాడినని భవానిని మురారి అడుగుతాడు. మరొకవైపు మురారికి గతం గుర్తుకు వస్తుందని రేవతి, కృష్ణ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.