English | Telugu
ప్రియాంక కన్నింగ్ గేమ్ బయటపెట్టిన నాగార్జున!
Updated : Dec 3, 2023
బిగ్‌బాస్ శనివారం నాటి ఎపిసోడ్ కోసం ఎంతోమంది ఎదురుచూస్తారు. కారణం కంటెస్టెంట్స్ చేసిన తప్పులని ఎత్తిచూపుతూ నాగార్జున వార్నింగ్ ఇస్తాడు. అదే జరిగింది. అర్జున్ మొదటి టికెట్ టు ఫినాలే సాధించినందుకు అభినందనలు తెలిపాడు. ఇక ఆ తర్వాత సీరియల్ బ్యాచ్‌కి వార్నింగ్ ఇచ్చాడు. శివాజీ, శోభాశెట్టి కలిసి అమర్ కి పాయింట్లు ఇవ్వడంపై నాగార్జున ఫైర్ అయ్యారు.
గౌతమ్, ప్రియాంకలకి గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. హౌస్‌లో ఉన్న వాళ్లంత సాయం చేసిన అమర్‌దీప్ ఫినాలే అస్త్రాన్ని గెలుచుకోలేకపోయాడు. మరోవైపు ఒక్కరు కూడా తన వెంట నిలబడకపోయిన అన్ని అడ్డంకులు దాటి ఒంటిచేత్తో ఫినాలే అస్త్రాన్ని గెలిచిన అర్జున్ కి అభినందనలు తెలిపాడు. సీరియల్ బ్యాచ్ పాలిటిక్స్‌ను, గ్రూప్ గేమ్‌పై ఫైర్ అయ్యాడు. ఏదో సమర్థించడానికి ట్రై చేసిన గౌతమ్‌కి కూడా వాతలు పడ్డాయి.
" నేను నా ఇండివిడ్యువల్ గేమ్ ఆడాను సర్. ఆ ఎమోషన్ లో అలా చేశాను. అలానే ఆడుతున్నా సర్" అని ప్రియాంక సమర్థించుకోగా.. నీ దృష్టిలో ఇండివిడ్యువల్ అంటే మీ ముగ్గురు అంతే కదా అంటూ నాగార్జున కుండబద్దలు కొట్డినట్టు మట్లాడాడు. ఇక తర్వాత అశ్వగంధ అలియాస్ గౌతమ్ ని అందుకున్నాడు. ప్రతిసారి శివాజీని నువ్వు నిలదీశేదేంటి? ఇద్దరికి మాత్రమే సపోర్ట్ ఉన్నాడని.. మరి అదే విధంగా ప్రియాంకని కూడా నువ్వు అడగాలి కదా.. ఎందుకు అడగలేదంటూ నాగార్జున సీరియస్ అయ్యాడు. దీనికి మొదటి నుంచి శివాజీ అన్న అంటూ గౌతమ్ ఏదో కవర్ చేస్తుండగా.. ఎప్పటి నుంచని కాదు.. ప్రియాంక ఆడింది ఇండివిడ్యువల్ గేమా? కాదా అన్నది నాకు చెప్పు అంటూ ఇరికించాడు నాగార్జున. అది రాంగ్ గేమ్ అని గౌతమ్ అన్నాడు.