English | Telugu
బెస్ట్ జూనియర్ డాక్టర్ గా కృష్ణని వరించిన అవార్డు.. అసూయతో ముకుంద!
Updated : Jul 20, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -213 లో.. గీతికతో ముకుంద ఫోన్ లో మాట్లాడుతుండగా తనేదో ఐడియా చెప్తుంది. అది విని చాలా బాగుందని గీతికతో ముకుంద అంటుంది. భవాని అత్తయ్యకి కృష్ణ, మురారీల అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి ఇప్పుడే చెప్పకూడదు. వాళ్ళు బాగా క్లోజ్ అయ్యాక చెప్తే.. ఇప్పటివరకు నన్ను మోసం చేసి నా ముందు నటించారా అని వాళ్ళని తిడుతుందని ముకుంద అనుకుంటుంది.
మరొకవైపు కృష్ణ, మురారిలు హాస్పిటల్ కి వెళ్తారు. కృష్ణ దగ్గర ఒక నర్సు వచ్చి.. ఏంటి కృష్ణ ఇలా చేసావ్. నీ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారని నర్సు అనగానే.. నేనేం చేశానని కృష్ణ టెన్షన్ పడుతుంది. కృష్ణ ఏం చేసిందని మురారి అడుగుతాడు. ఏమో కృష్ణ చేసిన పనికి లోపల అందరూ కోపంగా ఉన్నారని నర్సు చెప్తుంది. ఏసీపీ సర్ మీరు ఇక్కడే ఉండడని చెప్పి కృష్ణ లోపలికి వెళ్తుంది. కృష్ణ వెళ్లేసరికి.. పరిమళ మేడం కృష్ణను కోప్పడినట్లు యాక్ట్ చేస్తుంది.అక్కడే గౌతమ్ కూడా ఉంటాడు. ఏంటి కృష్ణ హాస్పిటల్ కి ఇంత మంచి పేరు తీసుకొచ్చావని గౌతమ్ అనగానే.. అసలు ఏమైందని కృష్ణ అడుగుతుంది. బెస్ట్ జూనియర్ డాక్టర్ గా నీకు ఇంటర్నేషనల్ అవార్డు వచ్చిందని గౌతమ్ చెప్పగానే.. కృష్ణ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ విషయం ఇంట్లో వాళ్లకి చెప్తానని గౌతమ్, పరిమళలకు కృష్ణ చెప్తుంది. కృష్ణ ఏం చేసిందని కార్ దగ్గర మురారి టెన్షన్ పడతాడు. అప్పుడే కృష్ణ వచ్చి సంతోషంతో మురారిని హగ్ చేసుకుంటుంది. తనకి వచ్చిన అవార్డు గురించి చెప్పి కృష్ణ తన హ్యాపీనెస్ ని మురారీతో షేర్ చేసుకుంటుంది.
ఆ తర్వాత కృష్ణ, మురారి ఇద్దరు ఇంటికి వస్తారు. ఈ గుడ్ న్యూస్ ని డైరెక్ట్ గా చెప్పకుండా.. ఏదైనా డ్రామా చేద్దామా అని కృష్ణ అంటుంది. అవసరం లేదని మురారి అంటాడు. కృష్ణ లోపలికి వెళ్లి భవాని ఆశీర్వాదం తీసుకొని తనకు అవార్డు వచ్చిన విషయం చెప్తుంది. కంగ్రాట్స్ అంటూ రేవతి చెప్తుంది. ఆ తర్వాత ఇంట్లో అందరికి స్వీట్స్ చేయమని రేవతితో భవాని చెప్తుంది. ఆ తర్వాత కృష్ణ ఇంట్లో అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. కృష్ణని అందరు పొగుడుతుంటే ముకుంద చూడలేకపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు అగాల్సిందే.