English | Telugu
మోస్ట్ పాపులర్ ఫిక్షన్ క్యారెక్టర్స్ లో కృష్ణకి మొదటి స్థానం!
Updated : Jul 20, 2023
తెలుగు టీవీ సీరియల్స్ లో బెస్ట్ యాక్టర్ గా 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ లోని కృష్ణ సెలెక్ట్ అయింది. స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్స్ లో టీఆర్పీలో మొదటి స్థానంలో బ్రహ్మముడి ఉండగా.. మూడవ స్థానంలో 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఉంది.
తాజాగా 'మోస్ట్ పాపులర్ ఫిక్షన్ క్యారెక్టర్స్ ' ర్యాంకింగ్స్ ని రిలీజ్ చేసింది ఓఆర్ మ్యాక్స్ సంస్థ.. ఈ ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో కృష్ణ ముకుంద మురారి సీరియల్ లోని కృష్ణ ఉండగా రెండవ స్థానంలో త్రినయని సీరియల్ లోని నయని ఉంది. కాగా గుప్పెడంత మనసు సీరియల్ లోని వసుధార మూడవ స్థానంలో, రిషి నాల్గవ స్థానంలో ఉన్నారు. అయితే 'మల్లి.. నిండు జాబిల్లి' సీరియల్ లోని మల్లికి అయిదవ స్థానం దక్కింది.
కృష్ణ ముకుంద మురారి సీరియల్ రోజు రోజుకి మరింత ఆసక్తికరంగా మారుతుంది. కారణం కృష్ణ, మురారి ఇద్దరు ఒకరికి తెలియకుండా ఒకరు ప్రేమించుకుంటారు. కానీ ఎవరి మనసులో ఏం ఉందో చెప్పుకోకుండా, తమలో తామే సందిగ్ధంలో ఉంటున్నారు. కాగా ఇదే సరైన సమయం అని భావించిన ముకుంద వాళ్ళిద్దరి మధ్య ఎలాగైనా దూరం పెంచాలని చూస్తుంది. నిన్న మొన్నటిదాకా భవానికి భయపడిన కృష్ణ.. తాజాగా జరుగుతున్న ఎపిసోడ్ లలో భవానికి దగ్గరవుతుంది. అలా కృష్ణ మారడానికి కారణం ఉంది.
గత వారం మురారిని జాబ్ కి వెళ్ళకూడదని కృష్ణ చెప్పడంతో.. తనకి ఆ జాబ్ ఎంత అవసరమో వివరించింది భవాని. దాంతో అప్పటిదాకా భవాని అంటే భయం ఉన్న కృష్ణ.. ఆ తర్వాత తన మాటలకి ఫిధా అయింది. ఆ తర్వాత తనని ఎలా ఇంప్రెస్ చేయాలని చూస్తుంది కృష్ణ. అయితే ఇప్పుడు జరుగుతున్న ఎపిసోడ్ లలో భవానిలాగా కృష్ణ రెడీ అయి భవానీతో పాటు ఇంట్లో వాళ్ళందరిని ఇంప్రెస్ చేసింది. దాంతో భవానికి కూడా కృష్ణపై పాజిటివ్ ఇంపాక్ట్ వచ్చింది. ఈ రకంగా కృష్ణ ముకుంద సీరియల్ లో ప్రతివారం ఒక ట్విస్ట్ తో ఆసక్తికరంగా సాగుతుంది. దాంతో ఈ సీరియల్ ని చూసే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఇప్పుడు కృష్ణ మోస్ట్ పాపులర్ ఫిక్షన్ క్యారెక్టర్స్ లో మొదటి స్థానాన్ని పొందింది.