English | Telugu
ఛాలెంజ్ విసిరిన కృష్ణ.. ముకుంద గర్వం దించనుందా?
Updated : Oct 7, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -281 లో.. ముకుంద ఎక్కడికి వెళ్ళిందని అలేఖ్యని అడుగుతుంది కృష్ణ. నాకేం తెలియదని అలేఖ్య చెప్పగానే.. మధుని కృష్ణ పక్కకి తీసుకొని వెళ్తుంది. ఏసీపీ సర్ తో ముకుంద వెళ్లే ఛాన్స్ ఉందా అని కృష్ణ అడుగుతుంది. అదేం ఉండదని మధు అంటాడు.
మరొకవైపు మురారి కోసం భవాని ఎదరుచూస్తుంటుంది. అప్పుడే మురారి, ముకుంద కలిసి వస్తారు.. ఆదర్శ్ గురించి ఆఫీసర్ ఏమన్నాడని భవాని ఆత్రుతగా అడుగుతుంది. ఆదర్శ్ వాళ్ళతో మాట్లాడుతున్నాడంటా, ఎలాగైనా ఆదర్శ్ ని ఇంటికి తీసుకొని వస్తానని మాట ఇచ్చాడని మురారి చెప్పగానే.. ఇంట్లో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక అందరు పూజకి ఏర్పాట్లు చెయ్యండని భవాని చెప్తుంది.. కృష్ణ మాత్రం మురారి తో మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. ముకుందని నీతో పాటు తీసుకొని వెళ్ళావా అని మధు అడుగుతాడు. తీసుకొని వెళ్ళాల్సి వచ్చిందని మురారి అంటాడు.. ఆ తర్వాత వినాయకుడిని తీసుకొని ప్రభాకర్ వస్తాడు. అందరు బయటకు వెళ్తారు. ఇంతమందిమి పండుగ జరుపుకుంటున్నాం. మీ నాన్నని కూడా రమ్మని పిలువచ్చు కదా అని ముకుందతో ప్రభాకర్ అంటాడు. నేను పిలవను, అయిన మా నాన్న రాడని ముకుంద చెప్తుంది.
వస్తాడు.. నీ నోటితోనే నువ్వు నాన్న రా అని పిలిచేలా చేస్తానని ముకుందతో కృష్ణ ఛాలెంజ్ చేస్తుంది. అది చూద్దామని ముకుంద అంటుంది.. ఆ తర్వాత పూజ కృష్ణ చేతుల మీదుగా జరుగుతుంది. నాతో ఎందుకు మాట్లాడడం లేదు కృష్ణ, ముకుందతో వెళ్లినందుక అని మురారి అంటాడు. మీ సంగతి తర్వాత చెప్తానని కృష్ణ అంటుంది. ఆ తర్వాత పూజ పూర్తవుతుంది. కాసేపటికి అందరు చీటీల ఆట ఆడుతారు. చీటీలలో తమ కోరికలకి రాస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.