English | Telugu

ఇంద్రజగారితోనే కంఫర్టబుల్ గా ఉంటుంది...

ఈవారం జబర్దస్త్ షో ప్రోమో భలే ఫన్నీగా ఉంది. రెగ్యులర్ గా ఉండేలా కాకుండా కొంచెం డిఫెరెంట్ గా ప్లాన్ చేశారు. "షో స్టార్ట్ ఐనా కూడా ఎవరూ రావట్లేదు" అని ఇంద్రజ షాకయ్యింది. ఇంతలో ఇంద్రజ, కృష్ణ భగవాన్ మధ్యన నూకరాజు మరో సీట్ లో ప్రత్యక్షమయ్యాడు. "కొంతమందిని ప్రశ్నలు అడగాలని ఫిక్స్ అయ్యాను" అంటూ ఆ తెలుగును మరీ కూని చేస్తూ మరీ చెప్పాడు. "ఎక్స్ట్రా జబర్దస్త్ లో కుష్బూ గారితో, జబర్దస్త్ లో ఇంద్రజ గారితో జడ్జిమెంట్ లో కూర్చున్నారు. ఎవరి జడ్జిమెంట్ కంఫర్టబుల్ గా ఉంటుంది." అని నూకరాజు కృష్ణ భగవాన్ ని అడిగేసరికి "కుష్బూ గారు హడావిడిలో ఉంటారు చూడరు కాబట్టి.. ఇంద్రజ గారితోనే కంఫర్టబుల్ గా ఉంటుంది" అని కృష్ణ భగవాన్ ఆన్సర్ ఇచ్చేసరికి ఇంద్రజ షాకైపోయి నవ్వేసింది. తర్వాత హోస్ట్ సిరి హన్మంత్ దగ్గరకు వచ్చి మరీ పరువు తీసేసాడు.

"సిరి హనుమంతు...జస్ట్ ఫర్ వన్ మంతు" అనే కొటేషన్ గురించి నువ్వేమనుకుంటున్నావ్ అన్నట్టుగా నూకరాజు అడిగేసరికి "వాడికి ఫ్యూచర్ ఉండాలని అలా రాసాడు" అని చెప్పింది సిరి. "అంటే మీరు కంటిన్యూ అవుతారా" అని నూకరాజు రివర్స్ లో అడిగేసరికి "అంతే కదా" అని చెప్పింది సిరి. సరే మీరే చూద్దురు గాని మీకే అర్ధమవుతుంది" అంటూ ఆమెను ఆటపట్టించేసరికి సిరి వాటర్ బాటిల్ తీసి నూకరాజు మీదకు విసిరేసింది. తర్వాత సద్దాం, యాదమ్మ రాజు ఇంకొంతమంది కలిసి "నువ్వొస్తానంటే నేనొద్దంటానా" అనే మూవీ సీన్స్ ని స్పూఫ్ గా చేసి స్కిట్ వేశారు. ఇక జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ లో లేడీ జడ్జెస్ ఇద్దరూ ఫుల్ కామెడీగా ఉంటారు..అవసరమైతే స్కిట్ లో ముందు ముందు రాబోయే డైలాగ్స్ ని కూడా వీళ్ళే ముందుముందుగా చెప్పేస్తారు. అవసరం అనుకుంటే వాళ్ళు కూడా స్కిట్స్ లో రోల్స్ కూడా ప్లే చేస్తారు. ఇలా ఈ రెండు షోస్ ఇద్దరు లేడీ ఓరియెంటెడ్ జడ్జెస్ తో ఇద్దరూ లేడీ ఓరియెంటెడ్ హోస్ట్స్ తో దుమ్ము రేపుతోంది.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..