English | Telugu

ఆడపిల్లలు తాగితే తప్పేంటి...బృంద, సుచిత్ర, తేజ మేమంతా క్లాస్‌మేట్స్!

జీవిత రాజశేఖర్ గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది. వాళ్లిద్దరూ ఇండస్ట్రీలో మంచి యాక్టర్స్. ఇద్దరూ కలిసి ఎన్నో మూవీస్ లో కూడా నటించారు. అలాంటి జీవిత రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూకి వచ్చారు. అందులో ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పారు. "మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీరేం చేస్తారు" అనేసరికి "నాకు రాజశేఖర్ ని ఇద్దరి పిల్లల్ని ఇంటిని చూసుకోవడమే ముఖ్యం. అదే నా మొదటి ప్రయారిటీ. వాళ్ళ పనులన్నీ నేనే చేస్తాను. వాళ్ళ పనులు ఇంకెవరన్నా చేసినా నాకు నచ్చదు. వాళ్లకు ఎలా ఎం కావాలో అలా అన్ని అమర్చి పెట్టడమే ఇష్టం. వాళ్లకు టైం ఇచ్చిన తర్వాత ఇంకా టైం మిగిలితే ఇంకేమన్నా పనులు చేస్తానేమో కానీ వాళ్ళే నాకు ముఖ్యం. నాకు గర్ల్ గ్యాంగ్ అని కానీ ఫ్రెండ్స్ అని కానీ ఎవరూ లేరు. నేను బయటకు వెళ్ళేదే చాలా తక్కువ. చుట్టాల వాళ్ళ ఇళ్లకు కూడా వెళ్ళను.

స్కూల్ లో చదువుకునేటప్పుడు ఒక ఆరుగురో ఏడుగురో ఫ్రెండ్స్ ఉండేవారు. ఆ ఫ్రెండ్స్ లో కొంతమంది ఎవరంటే డైరెక్టర్ తేజ, కొరియోగ్రాఫర్ బృంద, సుచిత్ర చంద్రబోస్ ఇలా మా క్లాస్మేట్స్ కొంతమందిమి కలిసి కరోనా టైములో చాలా టైం ఉండిపోయేది కదా.. ఎం చేయాలో తెలిసేది కాదు అలా ఇంకా కొంతమంది మాతో చదువుకున్న వాళ్ళ ఫోన్స్ నంబర్స్ గ్యాదర్ చేసి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకుని అందులో చాట్ చేసుకుంటూ ఉంటాం. అంతుకు మించి నాకు పెద్దగా ఎవరూ ఫ్రెండ్స్ అంటూ లేరు. ఎప్పుడైనా ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు తాగడం అనేది అస్సలు అలవాటు లేదు. ఐతే ఎవరైనా వచ్చి ఆడపిల్లా తాగొచ్చా అంటే ప్రశ్నిస్తే మాత్రం నేను ముందు వెళ్లి ఎందుకు తాగకూడదు అని నిలదీస్తా..తాగడానికి ఆడా, మగ తేడా ఏమిటి..ఎవరి లిమిట్స్ వాళ్లకు ఉన్నప్పుడు తాగితే తప్పేంటి..ప్రతీ దానికి కొన్ని ఎథిక్స్, కొన్ని పద్ధతులు ఉన్నాయి.. ఎవ్వరైనా సరే మర్యాదను కాపాడుకునే విధంగా ప్రవర్తిస్తే చాలు." అంటూ ఎన్నో విషయాలను చెప్పింది.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..