English | Telugu

బిగ్ బాస్ సీజన్-7 లో భారీ రెమ్యునరేషన్ తీసుకున్న కిరణ్ రాథోడ్!


కిరణ్ రాథోడ్.. బిగ్ బాస్ సీజన్-7 లో ఎలిమినేట్ అయిన మొదటి కంటెస్టెంట్. కిరణ్ రాథోడ్ బిగ్ బాస్ సీజన్-7 లోకి పన్నెండవ కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది. అయితే తనకి తెలుగు రాదు. ఇదే తను ఎలిమినేట్ అవడానికి ప్రధాన కారణంగా మిగిలింది. ఎందుకంటే హౌజ్ లో అందరితో కలవడానికి భాష కావాలి. తను మాత్రం హిందీ, ఇంగ్లీష్ లోనే మాట్లాడేది‌. దాంతో తోటి కంటెస్టెంట్స్ కి ఇబ్బందిగా మారింది.

కిరణ్ రాథోడ్ రాజస్థాన్ లో జన్మించింది. తనకి మాడలింగ్ మీద ఇంట్రెస్ట్ తో డిగ్రీ పూర్తయ్యాక ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తెలుగులో అల్లరి నరేష్ నటించిన 'కెవ్వు కేక' సినిమాలో కిరణ్ రాథోడ్ చేసింది. తను ఎక్కువగా తమిళంలో సినిమాలు చేసింది‌. అయితే తెలుగులో నువ్వు లేక నేను లేను సినిమాలో అరంగేట్రం చేసింది. భాగ్యలక్ష్మి బంపర్ డ్రా, ఉన్నత పాఠశాల, అందరు దొంగలే దొరికితే, చెప్పవే చిరుగాలి, నాని మొదలైన తెలుగు సినిమాల్లో చేసి క్రేజ్ సంపాదించుకుంది కిరణ్ రాథోడ్. మిధునరాశి సినిమాకి గాను ఉత్తమ నూతన ముఖ నటిగా తనకి అవార్డు కూడా వచ్చింది. కాగా తను ఇన్ స్టాగ్రామ్ లో హాట్ అండ్ బోల్డ్ ఫోటోలతో ఎప్పుడు‌ ట్రెండింగ్ లో ఉంటుంది.

కిరణ్ రాథోడ్ బిగ్ బాస్ లో నటిగా గ్లామర్ రోల్ ని చేయడంలో సక్సెస్ అయింది‌. అయితే తనకి కెమరా స్పేస్ తక్కువే దొరికింది. హోస్ట్ నాగార్జున తనకి తెలుగు నేర్చుకోమని చెప్పిన తను పట్టించుకోకపోవడం, ఒకరు ఇద్దరు కంటెస్టెంట్స్ మాత్రమే కలిసి మాట్లాడటంతో బిగ్ బాస్ చూసే ప్రేక్షకులకు కిరణ్ రాథోడ్ అసలు హౌజ్ లో ఉందా అనే డౌట్ ఏర్పడింది. అయితే కిరణ్ రాథోడ్ ఉన్నది ఏడు రోజలైనా రెమ్యునరేషన్ భారీగా అందింది. కిరణ్ రాథోడ్ కి రోజుకి 45 వేల చొప్పున రెమ్యునరేషన్ ఫిక్స్ అయిందంట. కాగా వారం రోజులకి గాను 3 లక్షల రూపాయల వరకు కిరణ్ రాథోడ్ రెమ్యునరేషన్ తీసుకుందని తెలుస్తుంది. కాగా తనని తాను నిరూపించుకోవాడికి సమయం ఇవ్వలేదని పలువురు విమర్శకులు విమర్శిస్తున్నారు.