English | Telugu

మురారి మీద కృష్ణకి అనుమానం.. ముకుంద ప్లాన్ అదేనా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -259 లో.. కృష్ణ ఉదయం లేచేసరికి మురారి గదిలో ఉండడు. కృష్ణ బయటకు వచ్చి చూసేసరికి మురారి, ముకుంద ఇద్దరు జాగింగ్ కి వెళ్తుంటారు. ఇదేంటి ఏసీపీ సర్ నాకు చెప్పకుండా వెళ్తున్నారు. ఎప్పుడు ముకుంద జాగింగ్ కి వెళ్ళేది కాదు ఈ రోజు వెళ్తుందేంటని కృష్ణ అనుకుంటుంది.

మరొక వైపు మురారి జాగింగ్ చేస్తుంటే ముకుంద అడ్డుపడుతుంటుంది. ముకుంద ఎంత మాట్లాడినా, తన ప్రాణ స్నేహితుడి భార్య అన్న గౌరవం తోనే మాట్లాడుతుంటాడు మురారి కానీ ముకుంద మాత్రం నా ప్రేమికుడు అన్నట్లు మాట్లాడుతుంది.. నువ్వేం చేసిన నీతో ఎంత కోపంగా మాట్లాడినా? నీకు ఇంకా అర్ధం కావడం లేదా అని మురారి అనగానే ఏం డబుల్ యాక్షన్ మురారి అని ముకుంద అంటుంది. పది రోజుల్లో కృష్ణ ఇంటి నుండి వెళ్లిపోయేలా చేస్తానని, అలాగే ఆదర్శ ఇంటికి రాడని ఒక వేల వచ్చిన మళ్ళీ వెళ్ళిపోయేలా నేను చేస్తానని, అంతే కాదు మీ ఫ్యామిలీ మొత్తం మన ప్రేమకీ అడ్డు వచ్చిన మనల్ని ఎవరు విడదీయ్యలేరని ముకుంద అనగానే.. మురారి పట్టించుకోకుండా వెళ్లిపోతాడు. బైక్ మీద వెళ్తుంటే ముకుంద వెనకాల కూర్చోబోయి పడిపోతుంది. అయ్యో ముకుంద అని ముకుందని మురారి పైకీ లేపి బైక్ పై ఇంటికి తీసుకొని వెళ్తాడు. మరొక వైపు తులసి పూజ చేస్తున్న కృష్ణ... వాళ్ళు రావడం గమనిస్తుంది. కృష్ణ అని మురారి పిలిచిన కృష్ణ పట్టించుకోదు. నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. కృష్ణలో అనుమానం మొదలు అయిందని ముకుంద అనుకుంటుంది. ముకుందని మురారి పట్టుకొని రావడం చూసిన కృష్ణ.‌ నా భర్త వేరొక అమ్మయిని పట్టుకొని వస్తే ఎందుకు ఇంత బాధగా ఉందని అనుకుంటుంది.

ఆ తర్వాత కృష్ణ లోపలికి వెళ్లి మురారి తో మాట్లాడుతుంది. ముకుంద జాగింగ్ చేస్తూ కిందపడిపోయిందని చెప్పగానే.. కృష్ణ ముకుంద దగ్గరికి వెళ్తుంది. ముకుంద మాత్రం నేను మురారి బైక్ ఎక్కబోయి కిందపడ్డానని చెప్పగానే కృష్ణ ఆలోచనలో పడుతుంది. ఏంటి ఏసీపీ సార్ అబద్ధం చెప్పాడా ముకుంద అబద్ధం చెప్తుందా అని కృష్ణ అనుకుంటుంది. ఆ తర్వాత చిన్న చిన్నగా నాపై కృష్ణకు డౌట్ వచ్చేలా చేసి తనకి నిజం చెప్పేస్తానని ముకుంద అనుకుంటుంది. ఆ తర్వాత ముకుంద దగ్గరికి అలేఖ్య వచ్చి.. ఆ రోజు గదిలో ముకుంద, మురారికి బదులు కృష్ణ, మురారి అని మార్చింది మధు అని ముకుందకి చెప్తుంది ముకుంద షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.