English | Telugu
అనసూయ, రష్మీ, సుధీర్ గురించి కామెంట్స్ చేసిన కిర్రాక్ ఆర్పీ
Updated : Mar 3, 2024
ఒకప్పుడు జబర్దస్త్ లో రష్మీ, అనసూయ, కిర్రాక్ ఆర్పీ, అభి, సుధీర్ ఇలా చెప్పుకుంటూ పొతే చాలామంది ఉన్నారు. ఐతే ప్రస్తుతం వీళ్ళలో రష్మీ మాత్రమే కంటిన్యూ అవుతోంది. కానీ మిగతా వాళ్లంతా మిగతా షోస్ లోకి, బిజినెస్ లోకి, మూవీస్ లోకి వెళ్లిపోయారు. ఇక కిర్రాక్ ఆర్పీ వీళ్ళ గురించి కొన్ని ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసాడు.
"సుడిగాలి సుధీర్ డిఫరెంట్ పర్సన్. తన మీద ఏదైనా పంచ్ వేసినా, జోక్ వేసినా తీసుకుంటాడు. టీమ్ లీడర్ గా సక్సెస్ అయ్యాడు. కామెడీ మాత్రమే కాకుండా మ్యాజిక్ లాంటివి వచ్చు కాబట్టి ఎక్స్ట్రా టాలెంట్ తో ఆడియన్స్ లో మంచి పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ మల్టీటాలెంటెడ్. రష్మీ అప్పటి వరకు ఉన్న యాంకర్స్ కంటే స్థాయి మించిన యాంకర్. ఇక్కడ పుట్టకుండా, ఇక్కడి భాష రాకుండా కూడా తనకు వచ్చిన భాషతో, తనకు వచ్చిన డాన్స్ తో ఆడియన్స్ మెప్పు పొంది అప్పటి వరకు ఉన్న పరిస్థితులను మార్చింది. ఇక అనసూయ తనకంటూ ప్రత్యేకమైన క్యారెక్టర్స్ చేసి మంచి పేరు తెచ్చుకుంది. ఆదికి నాకు బాగా కనెక్షన్ ఉంటుంది. ఆది బతకనేర్చినవాడు. ఎక్కడ ఎలా ఉండాలో బాగా తెలిసినవాడు. ఏదైతే రాసుకుంటాడో అది చెప్పగలడు...సడెన్ స్టార్ ఆది. మంచి టాలెంటెడ్ పర్సన్. రామ్ ప్రసాద్ ఆటో పంచులు బాగా వేస్తాడు...గెటప్ శీను బుల్లితెర కమల్ హాసన్. అందరిలోకి నాకు గెటప్ శీను అంటే చాలా ఇష్టం. బలగం వేణు ప్రతీ రిహార్సల్ ని ఒక సినిమా రేంజ్ లో చేస్తాడు. అందుకే అంత సక్సెస్ వచ్చింది. నేను, ఆది, చమ్మక్ చంద్ర, తాగుబోతు రమేష్, ధనరాజ్ మేమంతా రోజూ మాట్లాడుకుంటాం. కాన్ఫరెన్స్ లు పెట్టుకుని మరీ మాట్లాడుకుంటాం" అని చాలా విషయాలను చెప్పుకొచ్చాడు ఆర్పీ.
కిర్రాక్ ఆర్పీ జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు బిజినెస్ స్టార్ట్ చేసి మంచి సక్సెస్ ని అందుకున్నాడు.