English | Telugu
Guppedantha Manasu : అత్తయ్య అని తను ఎందుకు అంటుంది.. అసలు ఏంజిల్ ఎవరు?
Updated : Mar 3, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -1014 లో.. వసుధార బోర్డు మీటింగ్ లో మిషన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతుంది. ఎంతో మందికి చదువుకోవాలని కోరిక ఉండి చదువుకోలేని వారికి ఈ మిషన్ ఎడ్యుకేషన్ యూజ్ అవుతుందని వసుధార చెప్తుంది. ఈ మిషన్ ఎడ్యుకేషన్ గురించి నాకు మొత్తం వివరించండి అని వసుధారని మను అడుగుతాడు. దాంతో తను వివరిస్తుంది.
ఆ తర్వాత ఏంజిల్ కాలేజీ కి వస్తుంది. అనుపమ చూసి ఎందుకు ఇంత సడన్ గా ఇక్కడకి రావాలనిపించింది అని అడుగుతుంది. అంటే నాకు రిషి గురించి తెలిసిందని ఏంజిల్ బాధపడుతుంది. నాకు ఎందుకు చెప్పలేదని అనుపమని ఏంజిల్ అడుగుతుంది. ఆ తర్వాత రిషి గురించి జరిగింది మొత్తం ఏంజిల్ కి అనుపమ చెప్తుంది. వసుధార మాత్రం రిషి ఉన్నాడని అంటుందని ఏంజిల్ కి అనుపమ చెప్తుంది. అప్పుడే వసుధార, మను ఇద్దరు వస్తారు. వసుధారని చూసిన ఏంజిల్ హగ్ చేసుకుంటుంది. నువ్వు ఎందుకు వచ్చావో.. ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. రిషి సర్ ఉన్నారు.. నేను తీసుకొని వస్తానని ఏంజిల్ కి వసుధార చెప్తుంది. అత్తయ్య నాకు అంత చెప్పిందని ఏంజిల్ అనగానే.. అనుపమని అత్తయ్య అంటుందేంటని మను అనుకుంటాడు. ఆ తర్వాత మనుని ఏంజిల్ కి పరిచయం చేస్తుంది వసుధార. ఆ తర్వాత అనుపమని ఎందుకు అత్తయ్య అంటుందని మను ఆలోచిస్తుంటాడు. అప్పుడే మను దగ్గరికి ఏంజిల్ వచ్చి.. వసుధారకి చాలా హెల్ప్ చేస్తున్నారు థాంక్స్ అని అంటుంది.
మీరు అనుపమ గారిని అత్తయ్య అని అంటున్నారేంటని మను అడుగుతాడు. మా డాడ్ వాళ్ళ చెల్లి తను.. అందుకే అని తన కుటుంబం గురించి ఏంజిల్ చెప్తుంది. మీ తాతయ్య నేమ్ ఏంటి మను అడుగుతాడు. ఏంజిల్ ఏదో చెప్పబోతుంటే అనుపమ వచ్చి ఆపుతుంది. తర్వాత టాపిక్ ని డైవర్ట్ చేస్తుంది. అనుపమ టెన్షన్ పడడం వసుధార గమనిస్తుంది. మరొకవైపు రాజీవ్, శైలేంద్ర ఒక దగ్గర కలుసుకొని మను గురించి మాట్లాడుకుంటారు. నీకు కాలేజీలో.. నాకు బయట.. వాడు ఎప్పుడు ఎదరుపడుతన్నాడని రాజీవ్ అంటాడు. ఆ తర్వాత వసుధార వస్తుంటే కార్ ఆగిపోతుంది. అప్పుడే మను వచ్చి కార్ ఎందుకు ఆగిపోయిందో చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.